కోటం చంద్రశేఖర్ కవిత : మేధకు సవాల్

By Siva KodatiFirst Published Jan 19, 2024, 3:21 PM IST
Highlights

యెంత గింజుకున్నా యెంత చించుకున్నా క్యాలెండర్ ని వెనిక్కి తిప్పలేం అంటూ కోటం చంద్రశేఖర్ రాసిన కవిత  ' మేధకు సవాల్ ' ఇక్కడ చదవండి

కొన్ని మదిలోకి రావు
కొన్ని యాదిలోకి రావు
పారేసుకుంది ఇంట్లోనో బైటనో
పోగొట్టుకుంది ఎక్కడో స్పృహకు రావు
రోజులు గడుస్తున్నా నెలలై నడుస్తున్నా అంతే
ఆకాసం నుండి తోకచుక్క తెగిపోయినట్టు
నా నుండి తెగిపోయింది
మేఘం నుండి నీటిచుక్క రాలిపోయినట్టు
నా నుండి రాలిపోయింది
కొన్ని ఙ్ఞప్తికి రావు
కొన్ని గుర్తుకి రావు
మెదడు ఉతికి ఆరేసినా 
పేజీలు తిరిగేసినా
ఫలితాలు రావు
పరిస్థితులు అనుకూలమై పరిమళాలు తే (రా)వు
ఇష్టంగానో కష్టంగానో క్షణాలు దొర్లిస్తున్నా
అన్నీ మర్చిపోగలమా !
అన్నీ విడ్చిరాగలమా !
ఈజీచైర్లో కూర్చొని కళ్ళు మూస్తే
రైళ్లు పరుగెత్తాలి
సినిమా రీళ్లుగా కదలాలి
యెంత గింజుకున్నా యెంత చించుకున్నా మేధకు సవాలైంది
క్యాలెండర్ ని వెనిక్కి తిప్పలేం
కాలాన్ని రివైండ్ చేయలేం
నిఘానేత్రాలు సీసీ కెమెరాలు గతానికి లేనేలేవు
నిన్న పూసి రాలిన పూల శిధిలాలేవి !
వర్తమానం మీద శ్రద్ధాసక్తులు కనబరుస్తూ
పరిచయం లేని రేపటి ప్రపంచంలోకి అడుగులు మోస్తూ

click me!