'కళామతల్లి సేవలో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను'

Published : Jan 15, 2024, 11:52 AM IST
'కళామతల్లి సేవలో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను'

సారాంశం

ఏవికి ఫిలిమ్స్ సమర్పణలో లయన్ శ్రీరామ్ దత్తి నిర్మించిన ' ఓ తండ్రి తీర్పు ' చిత్ర  సమర్పకులు ఆరిగపూడి విజయ్ కుమార్ నూతన సంవత్సర క్యాలెండర్  ఆవిష్కరించారు. ఆ వివరాలు ఇక్కడ చదవండి : 

ఏవికి ఫిలిమ్స్ సమర్పణలో లయన్ శ్రీరామ్ దత్తి నిర్మించిన ' ఓ తండ్రి తీర్పు ' చిత్ర  సమర్పకులు ఆరిగపూడి విజయ్ కుమార్ నూతన సంవత్సర క్యాలెండర్  ఆవిష్కరించారు.
అనంతరం లయన్ డాక్టర్ ఆరిగపూడి విజయ్ కుమార్ మాట్లాడుతూ...కొందరి జీవితాల్లో కొన్ని కొన్ని మంచి పనులు చేసే అవకాశాలు వస్తాయి.  భగవంతుడు ఇచ్చిన వరం వల్ల నాకు  చాలా మంచి పనులు చేసే అవకాశం దక్కింది. మా తల్లిదండ్రులు ఆరిగపూడి నాంచారమ్మ పూర్ణచందర్ రావు గారిచ్చిన స్ఫూర్తితో  ముందుకు వెళుతున్న నన్ను  సోదర సమానులు నిర్మాత లయన్ శ్రీరామ్ దత్తి గారు కళా రంగానికి పరిచయం చేశారు అంతేకాకుండా ఎందరో ప్రతిభావంతుల కలలు  నెరవేర్చే అవకాశాన్ని అదృష్టాన్ని శ్రీరామ్ దత్తి గారు నాకు కల్పించారు అంటూ కృతజ్ఞతలు తెలిపారు.

ఒక మంచి సినిమాగా అందరి మనసుల్ని గెలుచుకునే ' ఓ తండ్రి తీర్పు సినిమా '  చేయడానికి ముఖ్య కారణం వారే. తమ్ముడు రాజేంద్ర రాజు కాంచనపల్లి ఈ చిత్రం కోసం పడిన కష్టం వృధా కాదు. మంచి కథ అందించిన  ప్రతాప్ రెడ్డి గారికి అభినందనలు.  స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం ఖర్చుకు వెనకాడకుండా రీ రికార్డింగ్ చేస్తున్న  నిర్మాత శ్రీరామ్ దత్తి గారికి  హాట్సాఫ్ అని అన్నారు.

 ఈ కార్యక్రమంలో దర్శకులు ప్రతాప్ రెడ్డి, బంగారు నంది అవార్డు గ్రహీత రాజేంద్ర రాజు కాంచనపల్లి , కోయ బోస్, ఎలమంచిలి శివరామకృష్ణయ్య, మురళీకృష్ణా రెడ్డి, సినిమా రామ సుబ్బారెడ్డి, పండు తదితరులు పాల్గొన్నారు.

PREV
click me!

Recommended Stories

Tim Cook books టిమ్ కుక్ ని మార్చేసిన పుస్తకాలు.. చదివితే మనకూ స్ఫూర్తి పాఠాలు
అపరాజిత అయోధ్య : రామాలయ చరిత్ర, శతాబ్దాల పోరాటం