అల్లుకున్న జ్ణాపకాలు "లేంబాళవాటిక కథలు"

By Siva Kodati  |  First Published Apr 10, 2022, 7:00 PM IST

పిన్నంశెట్టి కిషన్ రచించిన "లేంబాళవాటిక కథలు" సంపుటిని  కరీంనగర్ జిల్లా అదనపు  కలెక్టర్ జి వి శ్యామప్రసాద్ లాల్ శనివారం ఆవిష్కరించారు. రచయిత తన జ్ణాపకాలలో భద్రంగా వున్న అప్పటి వూరికి, ఇప్పటి వూరిలో వచ్చిన మార్పుల గురించి యథాతథంగా కళ్ళకు గట్టినట్లుగా చిత్రీకరించారు. 


తన వూరిని, ఆ వూరితో అల్లుకున్న జ్ణాపకాలను "లేంబాళవాటిక కథలు"గా పిన్నంశెట్టి కిషన్ పుస్తక రూపంలో తీసుకురావడం అభినందనీయమన్నారు కరీంనగర్ జిల్లా అదనపు  కలెక్టర్ (karimnagar district additional collector) జి వి శ్యామప్రసాద్ లాల్ . (gv shyam prasad lal) శనివారం నగరంలోని ఫిల్మ్ సొసైటీ, రాష్ట్ర బాషా సాంస్కృతిక శాఖ సంయుక్తంగా ఫిలింభవన్‌లో ఏర్పాటు చేసిన  కార్యక్రమంలో పిన్నంశెట్టి కిషన్ (pinnamshetty kishan) రాసిన ‘‘లేంబాళ వాటిక కథలు’’ (Lembhalavaatika Kathalu) సంపుటిని శ్యామప్రసాద్ లాల్ ఆవిష్కరించారు. 

అనంతరం అయన మాట్లాడుతూ ... రచయిత తన జ్ణాపకాలలో భద్రంగా వున్న అప్పటి వూరికి, ఇప్పటి వూరిలో వచ్చిన మార్పుల గురించి యథాతథంగా కళ్ళకు గట్టినట్లుగా చిత్రీకరించడంలో విజయం సాధించారని ప్రశంసించారు. కార్యక్రమంలో విశిష్ట అతిధిగా పాల్గొన్న కవి, రచయిత అన్నవరం దేవేందర్ మాట్లాడుతూ ‘లేంబాళ వాటిక కథలు’  కథలు కావని 60వ దశకంలో జరిగిన సామాజిక చరిత్ర అని వ్యాఖ్యానించారు. ఇలాంటి స్థానిక చరిత్రలు, ఆత్మ కథలు ఎవరికీ వారు రాసుకోవాల్సిన అవసరముందని దేవేందర్ అభిప్రాయపడ్డారు.

Latest Videos

పుస్తక సమీక్ష చేసిన డా బి వి ఎన్ స్వామి మాట్లాడుతూ.. ‘లేంబాళ వాటిక కథలు’ పుస్తకంలో సమాజంలో జరిగిన సంఘటనలు, అనుభవాలను కథల రూపంలో తీసుకువచ్చారని కొనియాడారు. ఈ సందర్భంగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డా. నలిమేల భాస్కర్ రచయితకు ఆశీస్సులు అందచేశారు. 

కపిసో  అధ్యక్షులు పొన్నం రవిచంద్ర అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో మాడిశెట్టి గోపాల్ వ్యాఖ్యాతగా  వ్యవహరించగా,  పి ఎస్. రవీంద్ర , గాజోజు నాగభూషణం , కూకట్ల తిరుపతి,  బూర్ల వెంకటేశ్వర్లు, మంచే సత్యనారాయణ,  పెనుగొండ భాసవేశ్వర్, కందుకూరి అంజయ్య , కె ఎస్ అనంతాచార్య, కార్పొరేటర్ చొప్పరి జయశ్రీ , కొమురవెల్లి వెంకటేశం, దశరథం శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.

click me!