ఘనంగా ప్రజాకవి కాళోజీ జయంతి: పూర్తి కాని కాళోజీ కళా క్షేత్రo పట్ల ఆవేదన

By telugu team  |  First Published Sep 9, 2021, 3:07 PM IST

ప్రజాకవి కాళోజీ జయంతి వేడుక హనుమకొండలో కాళోజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నేడు ఘనంగా జరిగింది.  కాళోజీ ఫౌండేషన్ ఏర్పడి ఆయన పుట్టిన రోజును మండలిక భాషా దినోత్సవంగా కాలేజీ ఫౌండేషన్ జరుపుతుంది.  


కాళోజి ఆశయాలను, ఆలోచనలను భావితరానికి తెలపాలని ఆ దిశగా కాళోజీ ఫౌండేషన్ కృషి చేస్తుందని సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ప్రముఖ నవలా రచయిత అంపశయ్య నవీన్ కాళోజీ ఫౌండేషన్ కృషిని కొనియాడారు.

ప్రజాకవి కాళోజీ జయంతి వేడుక హనుమకొండలో కాళోజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నేడు ఘనంగా జరిగింది.  ఈ వేడుకలో అంపశయ్య నవీన్, కాళోజీ ఫౌండేషన్ చైర్మన్ నాగిళ్ల రామశాస్త్రి,  ప్రధాన కార్యదర్శి   వి.ఆర్. విద్యార్థి,  కార్యదర్శి   పొట్లపల్లి శ్రీనివాసరావు, ఫౌండేషన్ బాధ్యులు డాక్టర్ బన్న ఐలయ్య, మహమ్మద్ సిరాజుద్దీన్, కాళోజీ కుటుంబ సభ్యులు కాళోజీ రవికుమార్, వాణి తదితరులు కాళోజీ విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు.

Latest Videos

కాళోజీ బతికున్నప్పుడే ఆయన అంగీకారంతోనే కాళోజీ ఫౌండేషన్ ఏర్పడి ఆయన పుట్టిన రోజును మండలిక భాషా దినోత్సవంగా కాలేజీ ఫౌండేషన్ జరుపుతుంది.  మన భాషకు పట్టంగట్టిన పలుకుబడి కాళోజీ నా గొడవ. ఆయన స్ఫూర్తితో తెలంగాణ యావత్తు కవులంతా ఒకటిగా నిలిచి తెలంగాణ ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచారు. తెలంగాణ సాధించిన తరువాత కాళోజీ  జయంతిని 'తెలంగాణ భాషా దినోత్సవం' గా మన ప్రియతమ ముఖ్యమంత్రి కెసిఆర్  ప్రకటించి ప్రతి ఏటా  ఒక కవికి  కాళోజీ స్మారక పురస్కారం గౌరవంగా అందిచడం పట్ల  కాళోజీ ఫౌండేషన్ ఆనందాన్ని వ్యక్తపరిచింది.

వరంగల్ లోని  కాళోజీ ఫౌండేషన్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాడక ముందు నుండే ప్రతి ‌సంవత్సరం రాష్ట్ర స్థాయిలో ఉత్తమ  సాహితీ వేత్తలకు  ప్రజా కవి కాళోజీ అవార్డు ప్రకటిస్తున్నది. ఈ సంవత్సరం మన భాషకు పట్టం కట్టి, అనేక తెలంగాణ పదాలను గుర్తించి తెలంగాణ పదకోశం ప్రకటించిన నలిమెల భాస్కర్ కి ప్రజా కవి కాళోజీ అవార్డు ప్రకటించింది.  అదే విధంగా కాళోజి అన్నగారైన రామేశ్వరరావు స్మారక అవార్డును ఈ సంవత్సరం ప్రముఖ జర్నలిస్టు జాహెద్ అలీ ఖాన్ కు ప్రకటించింది.

కాలోజీ నారాయణ రావు తెలంగాణ భావజాలాన్ని స్ఫూర్తిగా తీసుకున్న మన ముఖ్యమంత్రి కేసీఆర్      స్వరాష్ట్రంలో 100 రోజుల పాలన పిదప కాళోజి శత జయంతి  సందర్భంగా కాళోజి కళా క్షేత్రానికి శంకుస్థాపన చేసి తన విశాల హృదయాన్ని చాటారు. కానీ ఏడు సంవత్సరాలు అయినా ఇంతవరకు కళా క్షేత్రానికి తుదిరూపం రాకపోవడం,  ప్రారంభం విషయం లో సందిగ్ధత చోటు చేసుకోవడంతో   కాళోజీ ఫౌండేషన్ సభ్యులు సాహితీ అభిమానులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి  ప్రత్యేక శ్రద్ధ వహించి కళాక్షేత్రం పనులు త్వరితగతిన జరిగేట్లు చూడాలని కాళోజీ ఫౌండేషన్ కోరుకుంటున్నది.

click me!