డా.టి.రాధాకృష్ణమాచార్యులు రాసిన 'కదిలే నడక' లో కొన్ని హైకూలు ఇక్కడ చదవండి.
1.
నేలలో నేను
నాటాను ఓ విత్తనం
చెట్టైంది గూడు
2.
పూలు పూచెను
వీచే గాలి గంధమై
వేళ్ళు వెతుకు
undefined
3.
చెలిమి భూమి
ఎగురు ఆకాశమై
మనసు పాటై
4.
అమ్మ నా కన్ను
చూపింది జీవధార
ఊరు కొమ్మల్లో
5.
వానలు వస్తే
మట్టికి పులకింత
తీర్చే దాహం
6.
మనిషై ఉన్నా
ఒంటరిగా వ్యక్తినే
గుంపుగా బలం
7.
ఎవరు మీరు
ఎవరికి ఎవరు
ప్రశ్నే దహించే
8.
శ్రీగిరి మట్టి
మనిషి వెలుగులే
విద్యుజ్జ్వాలల్లో
9.
నడక కాళ్ళు
చిరునవ్వు ముళ్లల్లో
బతుకే ధైర్యం
10.
వైద్య వృత్తిలో
సేవే విలువ గీతం
స్వార్ధం అనర్ధం