సీజర్ వల్లెజో ఆంగ్ల కవితను జ్వలిత ' బిగిసిన శవం ' పేర అనుసృజన చేశారు. ఆ కవితను ఇక్కడ చదవండి :
‘మన్నించు ప్రభూ.. నేను శిశువుగానే మరణించాను’
ప్రియమైన ప్రభువా
ఇది శరదృతువు
దుమ్ము వాసనలో ఉన్నప్పటికీ
నేను శీతాకాలాన్ని గ్రహించగలను.
కానీ నేను ఎందుకింత చల్లగా ఉన్నాను?
నా చేతులు బిగుసుకు పోయాయి
నా కాళ్ళు చచ్చిపోయాయి
నా కళ్ళు మాత్రం తెరిచే ఉన్నాయి!
ప్రియమైన ప్రభూ…
ఎందుకు
నన్ను ఒక పెట్టెలో ఉంచుతున్నారు
మరి ఇకపై అరవలేను
ఇప్పటికీ గిరగిరా తిరుగుతూన్న
కాప్టర్లు నేను చూస్తున్నాను
అవి బాంబులు వేస్తున్నాయి
కానీ నేను ఇక ఎటూ పరుగెత్తడం లేదు
ప్రార్థన కూడా చేయలేను
ఎందుకు ప్రభూ?
నన్ను ఎత్తకోడానికి ఎవరూ లేరు ?
నా వారంతా ఎక్కడికి వెళ్లారు?
నేను స్మశానవాటికలో ఎందుకు నిద్రపోతున్నాను?
నాకు చివరి ప్రార్థన ఎవరు చేస్తారు?
ప్రియమైన ప్రభువా,
మీరు నాకు చివరి ప్రార్థన రాయనేలేదా?