జనగామ రచయితల సంఘం ఉపాధ్యక్షుడు నక్క సురేష్ రచించిన " జ్ఞానపుష్పం " కవిత్వ పుస్తకావిష్కరణ సభ ఈ నెల 13 శనివారం నాడు జనగామలో ఉన్నది. మరిన్ని వివరాలకు ఇక్కడ చూడండి.
జనగామ రచయితల సంఘం ఉపాధ్యక్షుడు నక్క సురేష్ రచించిన " జ్ఞానపుష్పం " కవిత్వ పుస్తకావిష్కరణ సభ ఈ నెల 13 శనివారం రోజున జనగామలో జరుగుతుందని తెలంగాణ విద్యావంతుల వేదిన జిల్లా అధ్యక్షుడు కోడం కుమారస్వామి ఒక ప్రకటనలో తెలిపారు. జనగామ జిల్లా కేంద్రంలోని నెహ్రూ పార్కు దగ్గరలో ఉన్న మీనాక్షి ఫంక్షన్ హాల్లో ఉదయం 10 గంటలకు సాంబరాజు అధ్యక్షతన నిర్వహించే కార్యక్రమానికి ముఖ్యాతిధిగా ప్రజాకవి జయరాజు, సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి, డాక్టర్ పసునూరు రవిందర్ పాల్గొంటారని తెలిపారు.
దోమకొండ సంస్థాన సాహిత్యసేవ అమూల్యం: తెలంగాణ సంస్థానాల సాహిత్య సేవ సదస్సులో వక్తలు
జిల్లాలోని వివిధ సంఘాల కవులు, రచయితలు, కళాకారులు పెద్ద ఎత్తున పాల్గొని సభను జయప్రదం చేయాలని కోడం కుమారస్వామి కోరారు. నక్క సురేష్ బహుజన సాహిత్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు. మరియు తెలంగాణ రాష్ట్ర ఎలట్రిసిటి ఎస్సీ అండ్ ఎస్టి ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ జనగామ జిల్లా అధ్యక్షులు. వీరు గతంలో రాసిన కవితలకు పలు సాహిత్య సంస్థలు మరియు ప్రముఖ సాహితీవేత్తల నుండి ప్రశంసలు అందుకున్నారు.