అలీ సర్దార్ జాఫ్రీ ఉర్దూ కవిత: నిశ్శబ్దం

Published : May 18, 2021, 12:35 PM ISTUpdated : May 18, 2021, 12:36 PM IST
అలీ సర్దార్ జాఫ్రీ ఉర్దూ కవిత: నిశ్శబ్దం

సారాంశం

ఇరుగు పొరుగు శీర్షిక కింద ప్రముఖ కవి వారాల ఆనంద్ సర్దార్ అలీ జాఫ్రీ ఉర్దూ కవితను నిశ్శబ్దం పేరు మీద తెలుగులో అందించారు. చదవండి.

నిశబ్దం 
ఓ కల 
బాధ యొక్క అవగాహన 

హృదయంలోని చీకటి పోగొట్టే 
ఓ వెలుతురు దీపం 

పదాలు 
పెదాలతో రూపొందలేదు 
నాలుకతో రుచి చూడలేదు 

కోయిలలు 
కోరికల తోటలో 
వసంతం వచ్చినప్పుడే కూస్తాయి 

ఇవ్వాళ 
పదాలు కేవలం పదాలే 
ఇంకా రూపొందనివి 
ఇంకా పలుకనివి 

ఆత్మ వీణపై 
మునివేళ్ళ నృత్య విన్యాసం 
శబ్దం లేని రూపం లేని 
కోరికల స్వర మాధుర్యం .

ఉర్దూ : అలీ సర్దార్ జాఫ్రీ 
ఇంగ్లిష్: బీదర్ బఖ్త్,కాథ్లీన్ గ్రంథ జిగర్ 
స్వేచ్చానువాదం: వారాల ఆనంద్
 
 

PREV
click me!

Recommended Stories

Tim Cook books టిమ్ కుక్ ని మార్చేసిన పుస్తకాలు.. చదివితే మనకూ స్ఫూర్తి పాఠాలు
అపరాజిత అయోధ్య : రామాలయ చరిత్ర, శతాబ్దాల పోరాటం