గోపగాని రవీందర్ కవిత: మనిషితనమే కావాలిప్పుడు..!

Published : May 17, 2021, 03:44 PM IST
గోపగాని రవీందర్ కవిత: మనిషితనమే కావాలిప్పుడు..!

సారాంశం

ఖచ్చితమైన మనిషితనమే కావాలిప్పుడు..! అంటన్న  గోపగాని రవీందర్ కవిత  చదవండి.

ఆపదల వలయాల్లో
చిక్కుకున్నవారికి చేయూతనిచ్చే 
దయార్ద్ర హృదయాలే  మొలకెత్తాలిప్పుడు
ఆందోళనతో కుంగిపోతున్న వారిలో
సమస్యల తెరలు తొలగిపోతాయనే 
భరోసాలనిచ్చే  ఆచరణలే  కావాలిప్పుడు
నిరాశల అంధకారంలో 
కొట్టుమిట్టాడుతున్న వారిలో
ఆశయాల ఆశలను రేకెత్తించడానికి
సమరోత్సాహమైన యోధులే కావాలిప్పుడు
ఊకదంపుడు సువచనాలు కాదు
అందరిలో మనోనిబ్బరాన్ని పూయించే
ఖచ్చితమైన మనిషితనమే కావాలిప్పుడు..!

PREV
click me!

Recommended Stories

Tim Cook books టిమ్ కుక్ ని మార్చేసిన పుస్తకాలు.. చదివితే మనకూ స్ఫూర్తి పాఠాలు
అపరాజిత అయోధ్య : రామాలయ చరిత్ర, శతాబ్దాల పోరాటం