ఇరుగు పొరుగు: శంఖా ఘోష్ బెంగాలీ కవిత పేరు

Published : Apr 22, 2021, 01:51 PM IST
ఇరుగు పొరుగు: శంఖా ఘోష్ బెంగాలీ కవిత పేరు

సారాంశం

సుప్రసిద్ధ బెంగాలీ కవి శంఖా ఘోష్ కోవిడ్ బారిన పడి 21 ఏప్రిల్ 21 బుధవారం మరణించారు. ఆయన 14 ఏప్రిల్ 21 న కోవిడ్ పాసిటివ్ గా నిర్దారించినప్పటి నుండి తన ఇంట్లో స్వీయ ఐసోలేషన్ లో వున్నారు.

వద్దు, నన్నసలే బలవంతం చేయొద్దు 

మాటలు తెరుచుకోనీ 
ఒక్కటొక్కటిగా పొరలు  పొరలుగా 
సూర్యోదయంలా విచ్చుకోనీ 

కుండపోత ప్రవాహం 
ఓ బండ రాయిని సులభంగా 
జనం నుంచి దూరంగా 
దోర్లించుకు పోయినట్టు 

క్షితిజ రేఖమీద మా పేర్లు 
నిశ్సబ్దంగా 
చాలా బలహీనంగా 
తుడిచివేయబడనీ 

నీటి బిందువులోని నీలిరంగు 
ముక్కలు ముక్కలై 
గడ్డి పైన కురవనీ 

మళ్ళీ నన్నెవరూ ఎప్పుడూ  
ఏ విధంగానూ బలవంతం చేయొద్దు. 

బెంగాలీ మూలం : శంఖా ఘోష్ 
ఇంగ్లిష్: కళ్యాన్ రాయ్ 
స్వేచ్చానువాదం: వారాల ఆనంద్
 

సుప్రసిద్ధ బెంగాలీ కవి శంఖా ఘోష్ కోవిడ్ బారిన పడి 21 ఏప్రిల్ 21 బుధవారం మరణించారు. ఆయన 14 ఏప్రిల్ 21 న కోవిడ్ పాసిటివ్ గా నిర్దారించినప్పటి నుండి తన ఇంట్లో స్వీయ ఐసోలేషన్ లో వున్నారు. 6 ఫిబ్రవరీ 1932న జన్మించిన శంఖా ఘోష్ అనేక రాజకీయ సామాజిక  సందర్భాల్లో ప్రజల పక్షాన గొంతెత్తి మాట్లాడారు. ఆయనకు 1977లో కేంద్ర సాహిత్య అకాడెమి అవార్డు,2011లో పద్మభూషణ్, 2016లో జ్ఞానపీఠ పురస్కారం లభించాయి.

PREV
click me!

Recommended Stories

Tim Cook books టిమ్ కుక్ ని మార్చేసిన పుస్తకాలు.. చదివితే మనకూ స్ఫూర్తి పాఠాలు
అపరాజిత అయోధ్య : రామాలయ చరిత్ర, శతాబ్దాల పోరాటం