ఆర్. సంగీత మలయాళీ కవిత: వృత్తం

By telugu team  |  First Published Mar 4, 2021, 4:27 PM IST

ఇరుగు పొరుగు శీర్షికలో భాగంగా ప్రముఖ కవి వారాల ఆనంద్ ఆర్ సంగీత మలయాళీ కవితను తెలుగులోకి అనువదించారు. ఆ కవితను ఇక్కడ చదవండి


చిన్నారి ఓ వృత్తాన్ని గీసింది 
దాని లోపల మరో వృత్తాన్ని గీసింది 
దాని లోపల మరోటి... మరోటి ......
బయటి వృత్తం చుట్టుకొలతకు సరిపడా 
లోపలి వృత్తం ఇమిడిపోయేటట్టు 
అట్లా గీస్తూ పోయింది
పోనూ పోనూ చివరికి 
ఓ 'చుక్క' ఉద్భవించింది
చెదిరిన జుట్టు తో ఎర్రబడ్డ కళ్ళతో 
చుక్క చిన్నారితో అంది 
నేను చుక్కను కాను ఓ వృత్తాన్నే
నన్ను స్వేచ్ఛగా వుండనీ 
వృత్తం చేసే పనులన్నీ చేస్తాను
చిన్నారి అంది 
'నిన్ను చుక్క అనే పిలిచాను 
ఇప్పుడేట్లా మార్చను'
అవును ఆ పని 
చాలా కాలం క్రితమే చేయాల్సింది 

మలయాళీ కవిత: ఆర్. సంగీత 
ఇంగ్లీష్: నిత్యా మరియమ్ జాన్ 
తెలుగు: వారాల ఆనంద్ 
--------------------------
ఆర్. సంగీత కొట్టాయామ్ జిల్లా చంగానచెర్రికి చెందిన ఉపాధ్యాయురాలు. ఆమె ఇంగ్లీషు సాహిత్యంలో పీజీ చేశారు.  సంగీత మొదటి కవితా సంకలనం 2016లో వెలువడింది

click me!