ఇరుగు పొరుగు శీర్షిక కింద ప్రముఖ తెలుగు కవి వారాల ఆనంద్ మంగలేష్ డబ్రాల్ హిందీ కవితను తెలుగులో అందించారు. ఆ కవితను ఇక్కడ చదవండి.
తలుపులు మూసేసి
కవిత రాద్దామని కూర్చున్నాను
చల్ల గాలి వీస్తోంది
కొద్దిగా వెలుతురు ప్రసరిస్తున్నది
ఇంటిముందు వర్షంలో
ఓ సైకిల్ నిలబడింది
ఓ పిల్లాడు ఇంటికి తిరిగి వస్తున్నాడు
నేనో కవిత రాసాను
కాని అందులో చల్ల గాలి లేదు వెలుతురు లేదు
సైకిల్ లేదు పిల్లాడూ లేడు
మూసిన
తలుపూ లేదు .
హిందీ మూలం ఆంగ్లానువాదం: మంగలేష్ డబ్రాల్
తెలుగు: వారాల ఆనంద్