సముద్రం, ఆకాశం, మైదానం పచ్చని అడవి అయితే ఎలా ఉంటుందో దర్భముళ్ల ' ఆకాంక్ష ' చదవండి.
ఇంత తెల్ల సంద్రమెందుకు.....?
హోరు భోరు మంటూ
నోట్లోంచీ నురగులు కక్కుతూ పరుగులు పెడుతూనే ఉంటుంది!!!
ఇంత ఎర్రటి రికౖ మైదానమెందుకు.....?
నిర్లిప్తతతో నిద్రిస్తూ
సాగిలపడ్డ నిరాసక్తపు చాపలా స్తబ్ధుగా పడి ఉంటుంది!!!
ఇంత నీలి ఆకాశమెందుకు.....?
తన బోళాతనం బోల్తా కొట్టిస్తే
శూన్యంతో సంథి చేసుకునే ఖాళీతనంలో కదలదు.... మెదలదు!!!
అంతా ఆకుపచ్చ అడవైతే.......???
అన్నీ చెట్టులే....
వాటి చాచిన కొమ్మల నిండుగా
స్వేచ్ఛగా చరించే రంగురంగుల పిట్టలే!!!