
అవునూ నేనెవర్ని శత్రువని పిలవాలి
శత్రువుకు అంత స్థాయి వుండాలి కదా
సూర్యునివైపు తిరిగి
నేను నడక కొనసాగించాను
ఆగ్రహంతో వున్న మెదడు కాదు
నా హృదయం ఓ ప్రశ్న వేస్తున్నది
హృదయమేమో సూర్యుడికి చిన్న సోదరుడు
అది అన్నీ చూస్తుంది
దానికి అన్నీ తెలుసు
పళ్ళు కొరకటమూ తెలుసు
దీవించడమూ తెలుసు
మెదడు ద్వారాన్ని హృదయం నుంచే తెరవాలి
అందులోకి ప్రవేశించాలనుకునే శత్రువు
మిత్రుడిగా మారే ప్రమాదానికి సిద్దపడాలి.
మూలం: జాయ్ హర్ జూ
తెలుగు: వారాల ఆనంద్
(జాయ్ హర్ జూ ఒక్లామా లో 1951 లో జన్మించారు. 2019 లో అమెరికా ఆస్థాన కవిగా నియమించబడ్డారు.ప్రస్తుతం అకాడమీ ఆఫ్ అమెరికన్ పోయెట్స్ కి చాన్సేల్లర్ గా వున్నారు. అనేక కవితా సంకలనాలు వెలువరించారు.)