ఆర్ఎస్ భాస్కర్ కొంకణీ కవిత: పదును కావాలి

Published : Feb 02, 2021, 02:49 PM IST
ఆర్ఎస్ భాస్కర్ కొంకణీ కవిత: పదును కావాలి

సారాంశం

ఇరుగు పొరుగు శీర్షిక కింద ప్రముఖ తెలుగు కవి వారాల ఆనంద్ కొంకణీ కవి ఆర్ఎస్ భాస్కర్ కవితను తెలుగులో అందిస్తున్నారు. ఆ కవితను చదవండి.

కొందరేమో 
నా పదాల్లో 
పదును కొరవడిందన్నారు
మరికొందరేమో 
నా అక్షరాల్లో ఉండాల్సినంత 
పదును లేదన్నారు
అందుకోసం 
నా పదాల్లోకి అక్షరాల్లోకీ 
పదును తెచ్చాను
ఫలితంగా కొందరు 
నానుంచి తమకు తామే 
దూరం జరిగారు .

కొంకణీ మూలం: ఆర్.ఎస్.భాస్కర్ 
ఇంగ్లీష్: ఆర్.ఎస్. శ్రీనివాస్ 
తెలుగు: వారాల ఆనంద్ 

PREV
click me!

Recommended Stories

Tim Cook books టిమ్ కుక్ ని మార్చేసిన పుస్తకాలు.. చదివితే మనకూ స్ఫూర్తి పాఠాలు
అపరాజిత అయోధ్య : రామాలయ చరిత్ర, శతాబ్దాల పోరాటం