ఇరుగు పొరుగు: కృష్ణమోహన్ ఝా కవిత నాన్న

Published : Jun 15, 2021, 01:57 PM IST
ఇరుగు పొరుగు: కృష్ణమోహన్ ఝా కవిత నాన్న

సారాంశం

ఇరుగు పొరుగు శీర్షిక కింద ప్రముఖ కవి వారాల ఆనంద్ కృష్ణమోహన్ ఝా మైథిలీ కవితను తెలుగు చేశారు. ఆ కవితను ఇక్కడ చదవండి.

మా నాన్న ప్రభావం నుండి 
తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ 
నా జీవితంలో సగం గడిచిపోయింది
నేనెట్లా బయటపడగలను 
దానికంటే ముందే 
నాన్నే విముక్తి చెందాడు
ఇప్పుడు నాకూ ఓ బిడ్డుంది 
నేను కూడా తండ్రినయిపోయాను
ఇప్పుడు 
నా నడకలో 
నా మాటలో 
నా అభినయంలో చూద్దునుకదా 
మా నాన్న 
మళ్ళీ వూపిరిపోసుకుంటున్నాడు 

            మైథిలీ మూలం: కృష్ణమోహన్ ఝా 
            ఇంగ్లీష్: సత్యానంద్ ఝా 
            తెలుగు: వారాల ఆనంద్ 

PREV
click me!

Recommended Stories

Tim Cook books టిమ్ కుక్ ని మార్చేసిన పుస్తకాలు.. చదివితే మనకూ స్ఫూర్తి పాఠాలు
అపరాజిత అయోధ్య : రామాలయ చరిత్ర, శతాబ్దాల పోరాటం