ఇరుగు పొరుగు శీర్షిక కింద ప్రముఖ కవి వారాల ఆనంద్ డానెజ్ స్మిత్ కవితను తెలుగులో అందించారు. ఆ కవితను చదవండి.
క్షీణించడం ఇక ఇక్కడ ముగిసిపోనీ ఎక్కడియితే ఊచకోత జరిగిందో అక్కడే అతనికి తేనె లాంటి మాధుర్యం దొరకనీ సింహం బోనులోకి అతన్ని దూరనివ్వండి అతనికి అక్కడే ఓ పూల తోట లభించనీ అతడికి స్వస్థతో ఊరటో దొరకనీ ఏదీ సాధ్యం కాకపోతే ఉన్నదేదో ఉన్నట్టు ఉండనివ్వండి