బ్లాక్ పోయెట్ లాంగ్ స్టన్ హ్యూజెస్ కవిత: నేను కూాడా

Published : Mar 16, 2021, 02:10 PM IST
బ్లాక్ పోయెట్ లాంగ్ స్టన్ హ్యూజెస్ కవిత: నేను కూాడా

సారాంశం

ఇరుగు పొరుగు శీర్షిక కింద ప్రముఖ తెలుగు కవి వారాల ఆనంద్ బ్లాక్ పోయెట్ లాంగ్ స్టన్ హ్యూజెస్ కవితను నేను కూడా అంటూ తెలుగులో ఇఅందించారు. ఆ కవితను చదవండి.

నేను కూడా 
అమెరికా పాటనే పాడతాను
కానీ 
నేనో నల్ల సోదరున్ని
వాళ్లేమో 'తోడు' దొరకగానే 
నన్ను వంటింట్లోకి వెళ్ళి తినమంటారు
నేనేమో నవ్వేస్తాను 
లోనికి వెళ్ళి బాగా తింటాను 
ఎంతో బలంగా ఎదుగుతాను
రేపు 
వాళ్ళకు తోడు దొరికినప్పుడు కూడా 
నేను టేబుల్ వద్దే వుంటాను 
వంటింట్లోకి వెళ్ళి తినమని చెప్పడానికి 
వాళ్లెవరికీ ధైర్యం చాలదు
దానికి తోడు 
నేనెంత అందంగా వున్నానో చూస్తారు 
సిగ్గుతో చచ్చిపోతారు
నేనూ అమెరికన్నే ... 

ఇంగ్లీష్: లాంగ్ స్టన్ హ్యూజెస్
అమెరికన్ బ్లాక్ పొయెట్ 
తెలుగు: వారాల ఆనంద్

PREV
click me!

Recommended Stories

Tim Cook books టిమ్ కుక్ ని మార్చేసిన పుస్తకాలు.. చదివితే మనకూ స్ఫూర్తి పాఠాలు
అపరాజిత అయోధ్య : రామాలయ చరిత్ర, శతాబ్దాల పోరాటం