సాహిర్ లుధ్యాన్వి ఉర్దూ కవిత: యుద్దం వాయిదా వెస్తేనే మంచిది

By telugu team  |  First Published May 20, 2021, 12:45 PM IST

పశ్చిమ ఆసియాలో యుద్ద మేఘాలు కమ్ముకున్న ప్రస్తుత తరుణంలో సుప్రసిద్ధ ఉర్దూ కవి, సినీ గీత రచయిత సాహిర్ లుధ్యాన్వీ దశాబ్దాల క్రితం  యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ రాసిన ఈ కవిత ఇప్పటికీ రెలెవెంట్


యుద్దం వాయిదా వేస్తేనే మంచిది 
భూమి నీదయినా నాదయినా 
దీపాలు వెలుగుతూవుంటేనే మంచిది 

రక్తం నీదయినా విదేశీయునిదయినా 
‘మెట్టుకు’ అది ఆదాము రక్తం కదా 
యుద్దం తూర్పునయినా పశ్చిమానయినా 
అది ‘ప్రపంచ శాంతి’ హత్య కదా

Latest Videos

undefined

యుద్దం ఓ పెద్ద ‘తెగులు’
ఏ బాధ కయినా అది ఉపశమనం ఎట్లా అవుతుంది 
రక్తం, నిప్పు ఈరోజు దయ చూపొచ్చు 
రేపది అత్యంత హీనమయింది, దేనికీ సరిపోనీది 

నీ ఆధిపత్య ప్రదర్శన కోసం 
రక్తప్రవాహం  అవసరమా 
నీ ఇంట్లో చీకటిని తరిమికొట్టడానికి 
ఇంకొకరి ఈ నగరాన్ని బూడిద చెయాలా 

బాంబులు ఇండ్ల పైనో సరిహద్దు పైనో కురువొచ్చు 
అవి భవనాల ఆత్మల్ని ధ్వంసం చేస్తాయి 
మండుతున్న భూమి నీదయినా విదేశీయునిదైనా 
నీరుపపేద బతుకులే బాధతో మెలికలు తిరుగుతాయి

యుద్ద టాంకులు దాడి చేయొచ్చు లేదా వెనుతిరగొచ్చు 
‘నేలగర్భం’ నిస్సారమవుతుంది 
విజయంతో విర్రవీగొచ్చు 
ఓటమితో దుఃఖపడొచ్చు 
ఏదయినా బతుకు నిష్పలమై 
విషాదంలో కూరుకు పోతుంది 

ఓ మచ్చ లేని మానవుడా 
దీనంగా ఆర్థిస్తున్నా 
యుద్దాన్ని వాయిదా వేయండి

నేల నాదయినా నీదయినా 
దీపాలు వెలుగుతూ వుంటేనే మంచిది 

click me!