కరీంనగర్ కు చెందిన ప్రముఖ కవి, నవలా రచయిత రేగులపాటి కిషన్ రావు (77) కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో ఆయన తుదిశ్వాస విడిచారు.
కరీంనగర్ కు చెందిన ప్రముఖ కవి, నవలా రచయిత రేగులపాటి కిషన్ రావు (77) ఇకలేరు. అనారోగ్య కారణాలతో ఆయన తుదిశ్వాస విడిచారు. కిషన్ రావు ఇప్పటికీ 4 నవలలు, 6 కథా సంకలనాలు, 13 కవిత్వ సంకలనాలు వెలువరించారు. సంఘసంస్కరణ అభ్యుదయ భావాలతో ఆయన రచనలు సాగాయి . 1976లో ఆమె వితంతువు కాదు, 1978లో పతివ్రత ఎవరు , 1981 లో సంఘర్షణ 1982లో ప్రేమకు పెళ్ళెప్పుడు అనే నవలలు ఆ కాలంలో గొప్ప పేరు. విరివిగా కథలు రాసేవారు.
గత ఏడేళ్లుగా అనారోగ్యంతో దాదాపు మంచం పైనే ఉన్నారు. కిషన్ రావు సతీమణి రేగులపాటి విజయలక్ష్మి కూడా ఆయన స్ఫూర్తితో రచనలు చేశారు. 1946 డిసెంబర్ 1న ఇప్పటి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని చింతల టానా లో కిషన్ రావు జన్మించారు. 1970 నుంచి 2004 వరకు ఉపాధ్యాయునిగా పనిచేసి కరీంనగర్‌లోని రాంనగర్లో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. ఆయన రచనలపై ఒక పీహెచ్‌డి కూడా వెలువడింది.మొదట డాక్టర్ నలిమెల భాస్కర్ తో కవిత్వ రచన ప్రారంభించారు. కిషన్ రావు మరణం పట్ల ప్రముఖ కవి అన్నవరం దేవేందర్ సంతాపం ప్రకటించారు. కిషన్ రావు మరణం పట్ల కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత వారాల ఆనంద్ విచారం వ్యక్తం చేశారు.