కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కృష్ణా పుస్తక పరిక్రమలో భాగంగా విద్యార్థులకు చిత్రకళ, వ్యాసరచన పోటీలు మంగళవారం మహబూబ్ నగర్ జిల్లాలో జరిగాయి.
కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కృష్ణా పుస్తక పరిక్రమలో భాగంగా విద్యార్థులకు చిత్రకళ, వ్యాసరచన పోటీలను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా నిన్న మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో సభ జరిగింది.
ప్రతి ఒక్కరూ పుస్తక పఠనం అలవర్చుకోవాలని, అందుకనుగుణంగా అభిరుచిని పెంచుకోవాలని మండల విద్యాధికారి ఎం.జయశ్రీ అన్నారు. మంగళవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని లిటిల్ స్కాలర్స్ హై స్కూల్ లో నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన కృష్ణా పుస్తక పరిక్రమ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా విచ్చేసి పుస్తక ప్రదర్శన యాత్రను ప్రారంభించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ విద్యార్థుల్లో సృజనాత్మక నైపుణ్యాలను పెంపొందించడానికి ఇలాంటి పుస్తక యాత్రలు దోహదపడుతాయన్నారు. నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రాంతీయ అధికారి, కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కార గ్రహీత డాక్టర్ పత్తిపాక మోహన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కృష్ణా పుస్తక పరిక్రమలో భాగంగా విద్యార్థులకు చిత్రకళ, వ్యాసరచన పోటీలను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ ఎస్.విజయకుమార్, లిటిల్ స్కాలర్స్ హైస్కూల్ కరస్పాండెంట్ జలజం అరుంధతీరాయ్, కార్యక్రమ సంయోజకులు డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్, లుంబిని పాఠశాల అధినేత కె.లక్ష్మణ్ గౌడ్, వల్లభాపురం జనార్దన, ఖాజా మైనోద్దీన్, బాదేపల్లి వెంకటయ్య, సృజామి తదితరులు పాల్గొన్నారు.