దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలయిన సందర్భంగా అమృతోత్సవాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో దేశభక్తి - పురోగతి - జాతీయత ప్రధానాంశాలుగా పాలపిట్ట వాసా ఫౌండేషన్ సంయుక్తంగా కవితల పోటీ నిర్వహించాయి. ఆ ఫలితాల వివరాలను ఇక్కడ చదవండి :
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలయిన సందర్భంగా అమృతోత్సవాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో దేశభక్తి - పురోగతి - జాతీయత ప్రధానాంశాలుగా పాలపిట్ట వాసా ఫౌండేషన్ సంయుక్తంగా కవితల పోటీ నిర్వహించాయి. డా. వాసా ప్రభావతిని స్మరించుకుంటూ జరిపిన ఈ పోటీకి విశేషమైన స్పందన వచ్చింది. పోటీకి వచ్చిన కవితలని క్షుణ్ణంగా పరిశీలించారు.
ఈ కవితల పోటీకి న్యాయనిర్ణేతగా ప్రముఖ విమర్శకులు ఎం. నారాయణశర్మ వ్యవహరించారు. జూన్ 6వ తేదీన హైదరాబాద్‌లోని చిక్కడపల్లి త్యాగరాయగానసభలో జరిగే సభలో బహుమతి ప్రదానోత్సవం ఉంటుంది.
ఈ కవితల పోటీ ఫలితాల వివరాలు:
మొదటి బహుమతి: శోకం లేని లోకం - నెల్లుట్ల రమాదేవి
రెండో బహుమతి: రేపటి సూర్యోదయం కోసం - పల్లా రోహిణీకుమార్
మూడో బహుమతి: అమృతోత్సవాల ప్రగతి స్ఫూర్తి - రాజా మానాపురం చంద్రశేఖర్
ఎనిమిది కవితలకు ప్రత్యేక బహుమతులు :
1. అభినవ భారతి - కరిపె రాజ్‌కుమార్
2. సత్యమేవ జయతే - స్వప్న మేకల
3. వెలుగులు నింపుదాం- అల్లాడి శ్రీనివాస్
4. వజ్రోత్సవ కానుక - దాసరి మోహన్
5. నా గుండె కాల్చుకుతినే గుడ్డె - వేల్పుల రాజు
6. పొడిచే పొద్దు - బొప్పెన వెంకటేష్
7. స్వేచ్ఛ లేని ప్రాణం మట్టిపటం - శ్రీకాంత్ బింగి
8. మట్టి తిలకం - బి. కళాగోపాల్
ఈ పోటీకి కవితలు పంపించిన కవులకు ధన్యవాదాలు తెలియజేస్తూ పోటీలో ఎంపికయిన కవితలని పాలపిట్ట పత్రికలో ప్రచురిస్తున్నట్టుగ పాలపిట్ట ఎడిటర్ గుడిపాటి ఒక ప్రకటనలో తెలిపారు.