డా.తిరునగరి శ్రీనివాస్ కవిత : ‘‘ నీకు నీవే ’’

Siva Kodati |  
Published : Jun 28, 2023, 07:31 PM IST
డా.తిరునగరి శ్రీనివాస్ కవిత : ‘‘ నీకు నీవే ’’

సారాంశం

ప్రముఖ బాలసాహితీవేత్త పెండెం జగదీశ్వర్ జయంతి సందర్భంగా - గుండె నిండిన విశాలతతో కూడిన నీ పలకరింపు గుర్తుకొస్తోంది...! అంటూ డా.తిరునగరి శ్రీనివాస్ రాసిన కవిత 'నీకు నీవే....' ఇక్కడ చదవండి

వేదనకు కూడా 
ఆవేదన కలిగింది 
ఎక్కడన్నా నువ్వు?
ఏ కథల్లో వెదికి పట్టుకోవాలి...
బాల్యానికి బృహత్కథల రెక్కలు తొడిగి 
ఎక్కడికి నువ్వెగిరి పోయావు?
స్నేహానికి అపురూపంగా తీర్చిన ప్రతిరూపానివి
పిల్లలకు అందమైన చెలికాడివి
అందరి వాడిగా అందలానికి ఎదిగి
అంతలోనే మాయమై శాశ్వత నిద్రకు వెళ్లిపోతే 
ఇంకా తడారని నీ జ్ఞాపకాలు
కన్నీళ్ళై కురుస్తున్నాయి...
కథా చిత్రాలు సదా 
నిన్ను గుర్తు చేస్తున్నాయి
నీలా ఎవరుంటారు?
నీవు తప్ప....
పిల్లల కథలకు ఎవరెస్టువి
బాల ప్రపంచానికి నిజంగా జగదీశుడివి
గుండె నిండిన విశాలతతో కూడిన
నీ పలకరింపు గుర్తుకొస్తోంది...!
కథల ఆకాశాన్ని సింగారించిన అద్భుత తారవి 
సత్కళా రత్నానివి
మా గుండెల్లో కలకాలం చిరంజీవివి....!

PREV
click me!

Recommended Stories

Tim Cook books టిమ్ కుక్ ని మార్చేసిన పుస్తకాలు.. చదివితే మనకూ స్ఫూర్తి పాఠాలు
అపరాజిత అయోధ్య : రామాలయ చరిత్ర, శతాబ్దాల పోరాటం