డాక్టర్ రాధేయ కవితా పురస్కారం - 2023

Published : Apr 22, 2023, 02:48 PM IST
డాక్టర్ రాధేయ కవితా పురస్కారం - 2023

సారాంశం

ఒక తడి అనేక సందర్భాలు, తూనీగతో సాయంకాలం, నూర్జహాన్ కు ప్రేమలేఖ అనే మూడు కవితా సంపుటాల ద్వారా తెలుగు కవితా లోకంలో విలక్షణకవిగా పేరుపొందిన కవి తెలుగు వెంకటేష్ డాక్టర్ రాధేయ కవితా పురస్కారం 2023కు ఎంపికయ్యారు.  

పద చిత్రాల పదనిసలతో కవిత్వానికి అపూర్వ పరిమళాలు అద్దుతున్న కవి తెలుగు వెంకటేష్ ను డాక్టర్ రాధేయ కవితా పురస్కార  వ్యవస్థాపకులు డా.పెళ్లూరు సునీల్,  డా.సుంకర గోపాలయ్య,  దోర్నాదుల సిద్ధార్థ అభినందనలతో ముంచెత్తారు.  ఈ పురస్కారం పొందిన కవికి రూ. 5000 /- నగదుతో పాటు ఘన సన్మానం ఉంటుంది. పురస్కార ప్రదాన తేదీ, వేదికను తరువాత తెలియజేస్తామని డాక్టర్ రాధేయ కవితా పురస్కార  వ్యవస్థాపకులు ఒక ప్రకటనలో తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Tim Cook books టిమ్ కుక్ ని మార్చేసిన పుస్తకాలు.. చదివితే మనకూ స్ఫూర్తి పాఠాలు
అపరాజిత అయోధ్య : రామాలయ చరిత్ర, శతాబ్దాల పోరాటం