యరకల యాదయ్య తెలుగు కవిత: చెప్తే వినడు

By telugu team  |  First Published Apr 5, 2020, 2:35 PM IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విస్తరినస్తున్న నేపథ్యంలో భారతదేశంలో లాక్ డౌన్ అమలులో ఉంది. ఈ లాక్ డౌన్ నియమాలను పాటించకపోవడంపై ఆగ్రహంతో యరకల యాదయ్య కవిత రాశారు.


చెప్తే వినడు వీడు చెప్తే వినడు
అన్ని నాకు తెల్సునంటడు

చెప్తే వినటాన్కి చిన్నోడు కాడు
చెప్పేదానికి పెద్దోడు కాడు
మీడియా అంతా కోడై కూసిన
లోకానికంత డప్ఫై చాటిన

Latest Videos

చెప్తేవినడు వీడు చెప్తే వినడు
అన్ని నాకు తెల్సు నంటడు

గడపదాటి తిరుగొద్దంటే
ఊరంతా నాదే నంటడు
నెత్తినోరు బాదుకున్న
తిరిగేది ఆపనంటడు
బద్రంగుండని యెంత చెప్పిన
పిచ్చోలని ముద్ర వేస్తడు 

చెప్తే వినడు వీడు చెప్తే వినడు
అన్ని నాకు తెల్సు నంటడు

తియ్య తియ్యని మాటలతో
తియ్యగ గొంతు కొస్తదన్న 
సన్నిహితుడు హితుడైన
సావసం ముచ్చటే వద్దన్న

చెప్తే వినడు వీడు చెప్తే వినడు
అన్ని నాకు తెల్సునంటడు

మాయదారి కరోన రోగం
గొలుసులల్లుతున్నదంటే 
సంచరించే దారిలో సప్పున
కాటేస్తదన్న
నాల్గుదినాలోపికపట్టి
ఇంటి పట్టున ఉండమ్మన్న

చెప్తే వినడు వీడు చెప్తే వినడు
అన్ని నాకు తెల్సునంటడు

మంచి మాటలు యెంత చెప్పిన
చెవిన పెట్టనోడు
విశ్వానంత చుట్టివేసిన ఇకనైన
తెలుసుకోనోడు
అంత అయ్యి పోయినంక 
తెల్సుకొంటే ఏముంటది.
కొంతనైన జాగ్రత పడితే
విశ్వమంత నీదే ఔతది.

చెప్తే వినడు వీడు చెప్తే వినడు
అన్ని నాకు తెల్సునంటడు .

మరింత సాహిత్యం కోసం క్లిక్ చేయండి: https://telugu.asianetnews.com/topic/literature

click me!