డాక్టర్ బాణాల శ్రీనివాసరావు కవిత: ఏకత్వంలో భిన్నత్వం

By telugu team  |  First Published Jan 20, 2021, 3:04 PM IST

హింస పరమ ధర్మమైన వేళ ఏకత్వంలోని భిన్నత్వం ఎలా ఉందో డాక్టర్ బాణాల శ్రీనివాసరావు కవితలో చదవండి


భయం కొండల్ని
పాకలేని 
నిరాశానిస్పృహలు

గుండెల్లో మతంపులి
పిడుగులైతే!
కన్నీళ్ల దోసిళ్ళతో
ప్రాణంలేని స్థితిలోకి

Latest Videos


కాలం ఘనీభవిస్తే....
క్షణమొక
రెక్క విరిగిన పక్షి

వెంటాడే అభద్రతలో
ఊపిరి పీల్చుకోలేని
బలి పశువులు
ప్రాణాల్లే నిస్థితిలోకి
కూరుకుపోతూ....

ప్రశ్నల వాల్మీకాల్ని
చేధించలేని
సమాదానాల
సారీసృపాలు

హింస పరమ ధర్మమైన వేళ
ఏకత్వంలో
భిన్నత్వం

మెడలో....
అనైకమత్యదండల్తో
అరనిముషంలో
అందరూ
ఖతం...
వేల నాదాల్తో
అనేక గొంతులు....

click me!