లూయిస్ గ్లూక్ ఇప్పటికి పన్నెండు కవితా సంపుటాలను వెలువరించారు. వారి కవిత 'ముగింపు' చదవండి. తెలుగు అనువాదం స్వాతి శ్రీపాద
ఇప్పుడే రాసిన దాన్ని చదువుకున్నాను, ఇప్పుడు నమ్ముతాను
అనాలోచితంగా ఆపేసానని
అందువల్లే కదా నా కధ కొంచం అలుక్కుపోయినట్టు
ముగింపు , అసలు కధలా కాకుండా , ఉన్నట్టుండి కాకుండా
ఒకరకమైన తెచ్చిపెట్టుకున్న పొగమంచులాటిది వేదికపై చల్లుకుని
కష్టమైన ఏర్పాట్లను మార్చుకోనిస్తుంది
నేనెందుకు ఆపేసాను? ఏదో ఒక ప్రేరణ
ఒక ఆకారపు గ్రహింపునిచ్చిందా?
నాలోని ఒక కళాకారుడు ట్రాఫిక్ ఆపడానికి
తలదూరుస్తున్నాడా, ఎప్పటిలానే?
కవులన్నట్టుగా ఒక ఆకారం. లేదా భవిశ్యత్తు
చాలా కాలం క్రితం కొద్ది గంటల్లోనే అవలీలగా తెలిసిపోయింది.
undefined
ఒకప్పుడు అలా అనుకుని ఉంటాను.
అయినా ఇప్పటికీ ఆ పదం నచ్చదు నాకు,
అది ఒక దశ, ఒక ఊతకర్ర, బహుశా
మానసిక కౌమారం కావచ్చు-
అయినా అది నేను వాడిన పదం
నా వైఫల్యాలు వివరించడానికి.
విధి, భవిష్యత్తు వాటి నమూనాలూ హెచ్చరికలూ
అంతులేని అయోమయాలే.
ఇప్పుడు నాకు మామూలు
స్థానికి సమరూపాలే , పనికి రాని అన్యాపదేశ వస్తువులే,
నేను చూసినది గొప్ప అస్తవ్యస్తతే.
నా బ్రష్ గడ్డకట్టిపోయింది.
నేను దాన్ని చిత్రించలేను. ఉన్న అనుభూతల్లా చీకటీ
నిశ్శబ్దమే.
ఇహ ఏమని పిలుద్దాం దాన్ని?
దృష్టి సంక్షోభమో - తత్సంబధితమో -అనే నమ్ముతాను నేను
నా తలిదండ్రులను చూసిన చెట్టుకు
కాని వాళ్ళు మాత్రం బలవంతాన ముందుకు వెళ్ళి
అడ్డంకుల్లో పడ్డారు.
నేను వెనుదిరిగాను లేదా పారిపోయాను.
పొగమంచు వేదికను( నా జీవితం) కమ్మేసింది.
పాత్రలు వచ్చాయి, వెళ్ళాయి.
కేవలం దుస్తులే మారాయి.
నా బ్రష్ చెయ్యి కాన్వాస్ కు మరీ దూరంగా
ఇటు నుండి అటు కదిలింది., విండ్ షీల్డ్ వైపర్ లాగా.
ఖచ్చితంగా ఇది ఎడారే - చీకటి రాత్రే.
( నిజానికి లండన్ లో రద్దీగా ఉన్న వీధి. పర్యాటకులు రంగు రంగుల పటాలను ఊపుతున్నారు)
ఒకరు ఏదో ఒక పదం అంటారు: నేను
ఈ ప్రవాహం నుండి అద్భుతమైన రూపాలు
సుదీర్ఘ శ్వాస తీసుకున్నాను నేను
అది నా వరకూ వచ్చింది.
ఆ శ్వాస తీసుకున్న వ్యక్తి నా కధలో పాత్ర కాదు.
అతని తెలివి తక్కువ చెయ్యి నమ్మకంగా క్రేయాన్ ను యేలుతుంది
నేనే ఆ మనిషినయితే , ఒక బాలుడే అయినా అన్వేషకుడు కూడా
ఉన్నట్టుండి దారి స్పష్టంగా కనబడుతుంది
ఎవరికైతే మొక్క భాగాలు-- ఆ తరువాత , చూపుకు అందనివి
అది ఉన్నతమైనదయితే ఒంటరి కాంట్ కి వంతెన దారిలో అనుభవమైనదే
( మా పుట్టిన రోజు ఒకే రోజు)
జనవరి చివరి రోజులు
బయట, పండుగ సందడిలో వీధులన్నీ కలగలిసి
అలసిసొలసిన క్రిస్ మస్ దీపాల మధ్య
ఒక స్త్రీ తన ప్రియుడి భుజం మీదకు ఒరిగి
జాక్స్ బ్రెల్ ఆమె సన్నని పంచమ స్వరంలో పాడుతూ...
శభాష్, తలుపు మూసి ఉంది
ఏదీ తప్పించుకోలేదు. ఏదీ లోనికి రాలేదు
నేను కదల్లేదు,
ఎడారి ముందుకు విస్తరిస్తున్నట్టుగా ఉంది
విస్తరిస్తూ ( ఇప్పుడు అనిపిస్తోంది)
అన్నివైపులా నేను మాట్లాడుతూ ఉంటే మారుతూ
దానివల్ల నేను నిరంతరం శూన్యంతో ముఖాముఖీ ఉంటూ
ఆ ఉదాత్తమైన సవతి బిడ్డ నా విషయమూ నా మాధ్యమంగా మారింది
నా మరో కవల ఏం చెప్పాడు
నా ఆలోచనలు అతన్ని చేరాయా?
నా విషయంలో ఏ అడ్డంకీ లేదని (వాదన కోసం)
బహుశా అతను చెప్పి ఉంటాడు
ఆ తరువాత మతాన్ని సంప్రదించే వాడీని
శ్మశాన వాటిక, అదే కదా నమ్మకానికి జవాబు చెప్పగలిగేది
పొగమంచు వీడిపోయింది. ఖాళీ కాన్వాస్ లు
గోడవైపుకు లోనికి తిరిగాయి.
చిన్న పిల్లి చచ్చిపోయింది( ఆ పాట అలా సాగింది)
నేణు మరణమ్ నుండి పైకి లేస్తానా? ఆత్మ ప్రశ్న అది.
అవునంటూ సూర్యుడి జవాబు
ఏదారి జవాబిస్తుంది
నీ స్వరం గాలిలో విస్తరించిన ఇసుక
చాలా వారాల కిందటే, ఎండలో కూచున్న అమ్మ ఫొటో ఒకటి కనిపించింది.
విజయోత్సాహంతో ఆమె మొహం ఎరుపెక్కి నట్టుంది.
ఎండ మెరుపు
ఆమె కాళ్ళ దగ్గర కుక్కల్తో పాటు సమయమూ నిద్రిస్తూంది, ప్రశాంతంగా , కదలకుండా అన్ని ఫొటోలలో మాదిరే.
అమ్మ మొహం మీద దుమ్ము తుడిచాను.
నిజం, అన్నింటి మీదా పేరుకున్న దుమ్మే. బాల్యంలోని అవశేషాలను రక్షించే, నిరంతరం కొనసాగే గతపు వ్యామోహం మసకలా అనిపించింది నాకు.
వెనకాల నేపద్యంలా పార్క్ వస్తువులు, చెట్లూ పొదలూ.
ఆకాశాన సూర్యూడు కిందకు దిగాడు, నీడలు పొడుగయాయి
మరింత దుమ్ము తుడిచే సరికి, ఈ నీడలు మరింత పెరిగాయి
వేసవి వచ్చేసింది.
పిల్లలు గులాబీల అంచులపై ఒరిగడాన, వాళ్ళ నీడలూ గులాబీనీడల్లో కలగలిసిపోయాయి.
నా మనసులోకి ఒక మాట వచ్చింది, ఈ మార్పుకూ, ఈ చలనానికీ సంబందించి, ఈ తుడిపేసిన మార్పులు ఇప్పుడూ మరింత స్పష్టంగా -
అది కనిపించింది , ఆ వెంటనే మాయమయింది.
అది గుడ్డితనమా? చీకటా? ప్రమాదమా? అయోమయమా?
వేసవి వచ్చేసింది. ఆ తరువాత శిశిరం. ఆకులు మారుతున్నాయి. పిల్లల చురుకుతో రాగి రంగూ కాషాయానికీ తిరిగిన మచ్చలు.
(లూయిస్ గ్లూక్ 2020 నోబెల్ బహుమతి గ్రహీత అమెరికాలో అత్యుత్తమ ప్రతిభగల కవిగా భావించే ఆమె కవిత్వంలో సాంకేతిక నిర్దిష్టత , సౌకుమార్యం, ఏకాంతపు అంతః పరిశీలన , కుటుంబ అనుబంధాలు, విడాకులు మృత్యువు అనేవి ముఖ్యమైన అంశాలు.
ఆమెకు నోబెల్ బహుమానం ఇచ్చినది ఆమె అద్భుతమైన నిరాడంబర సౌందర్యం వ్యక్తి ఉనికిని ఎలా విశ్వవ్యాప్తం చేస్తుందనే బలమైన కవితా స్వరానికి. ఇప్పటికి పన్నెండు కవితా సంపుటాలను వెలువరించారు. వారి కవిత 'ముగింపు' చదవండి. తెలుగు అనువాదం స్వాతి శ్రీపాద)