జావేద్ అఖ్తర్ రాసిన ఉర్దూ కవితను ఇరుుగ పొరుగులో భాగంగా వారాల ఆనంద్ తెలుగులోకి ఉదయపు కన్య పేరు మీద అనువదించారు. ఆ కవితను చదవండి.
నల్లటి రాత్రి దుప్పట్లో
ముఖం కప్పుకొని
ఉదయపు కన్య
దీర్ఘ నిద్రలో వుంది
ఆమె తన దుప్పటి కంతల్లోంచి
తొంగి చూడదు
ఒక మాటా పలుకదు
సూర్యుణ్ణి ఎవరో దొంగిలించుకు
పోయినప్పటినుండీ
ఆమె విసుగు విసుగ్గా వుందిరండి మనం
సూర్యుణ్ణి వెతుకుదాం
సూర్యుడు దొరకకుంటే
ఒక్కో కిరణాన్నీ జమ చేసి
మరో కొత్త సూర్యుణ్ణి నిర్మిద్దాం
చాలా సేపటినుండీ
ఉదయపు కన్య
అలిగి నిద్రపోతున్నది
రండి
ఆమెను మేల్కొల్పుదాం
ఊరడిద్దాం .
undefined
ఇంగ్లీష్: డేవిడ్ మాథ్యూస్, అలీ హుసైన్ మీర్
తెలుగు: వారాల ఆనంద్