డోగ్రీ భాషా కవయిత్రి పద్మా సచ్ దేవ్ మృతి: నివాళిగా ఆమె కవితలు రెండు

By telugu teamFirst Published Aug 4, 2021, 8:17 PM IST
Highlights

తొలి సుప్రసిద్ధ డోగ్రి భాషా కవయిత్రి, నవలా రచయిత్రి పద్మశ్రీ అవార్డు గహీత పద్మా సచ్ దేవ్ బుధవారం (4 ఆగస్ట్ 2021) ముంబై లోని ఒక ఆసుపత్రిలో మృతి చెందారు. జమ్మూ ప్రాంతంలోని పుర్మందల్ లో 1940 లో జన్మించిన పద్మా సచ్ దేవ్ డోగ్రి హిందీ భాషల్లో అనేక రచనలు చేసారు.

తొలి సుప్రసిద్ధ డోగ్రి భాషా కవయిత్రి, నవలా రచయిత్రి పద్మశ్రీ అవార్డు గహీత పద్మా సచ్ దేవ్ బుధవారం (4 ఆగస్ట్ 2021) ముంబై లోని ఒక ఆసుపత్రిలో మృతి చెందారు. జమ్మూ ప్రాంతంలోని పుర్మందల్ లో 1940 లో జన్మించిన పద్మా సచ్ దేవ్ డోగ్రి హిందీ భాషల్లో అనేక రచనలు చేసారు. అమె  ‘మేరి కవిత మేరి గీత్’  పుస్తకానికి కేండ్ర సాహిత్య అకాడెమి అవార్డును అందుకున్నారు. ఇంకా కబీర్ సమ్మాన్ లాంటి అనేక పురస్కారాలు అందుకున్న ఆమె కొన్ని సినిమాలకు పాటలు రాసారు రేడియో లో ప్రయోక్తగా పనిచేసారు. ఆమె రాసిన రెండు కవితల అనువాదాలు పాఠకుల కోసం 

తాత్కాలిక శిబిరం 

నేను 
ఇంట్లోనో స్టూడియో లోనో 
ఒంటరిగా వున్నప్పుడు 

నా గమ్యం నా పక్కన నిలబడి 
సున్నితంగానూ ఒకింత కపటంగానూ 
సైగ చేస్తూ  
నా ఒంటరితనపు భారాన్ని తగ్గిస్తుంది 

దానికి నివాసం లేదు 
అయినా నేను అత్యాశతో 
దాన్ని అనుసరిస్తూ వెంట వెళ్ళాలనుకుంటాను

నా కోరిక 
నా బంధాల్ని తుంచడం ఆరంభిస్తుంది 

నేనొకప్పుడు 
తాత్కాలిక శిబిరమనుకున్న
ఇక్కడే 
ఓ పిరికి రక్షణా భావం 
నన్ను వెనక్కి లాగుతుంది 

=================================== 

జీవితం 

నాకు అవసరం లేనిది 
నా వద్ద వున్నప్పుడు 
జీవితం 
ఎంత నిండుగానూ నిర్మలంగానూ వుండేది 

ఓ దారేదో 
అర్దాంతరంగా ముగిసినట్టు 

ఒకప్పుడు 
ఓ వంతేనేదో కలిపినట్టు 
-------------------
ఇంగ్లిష్: ఇక్బాల్ మసూద్ 
తెలుగు స్వేచ్చానువాదం: వారాల ఆనంద్

click me!