దిలీప్ వి తెలుగు కవిత: కనుక్కోండి....

By telugu team  |  First Published Oct 23, 2020, 1:49 PM IST

దిలీప్ వీ అనే కవి కనుక్కోండి అనే కవితను రాశారు. ఏషియా నెట్ న్యూస్ పాఠకుల కోసం ఆ కవితను అందిస్తున్నాం.


ఆకలైతే కాదు
నన్ను చంపింది
పస్తులుoడి ఆకలితో
అలమటించిన
దినములెన్నో...

పేదరికం కాదు
నన్ను వల్లకాటికి చేర్చింది
అయితే..
ఇన్నేళ్ల నుండి దానితోనే కదా
సావాసం చేస్తున్నది

Latest Videos

కరోనాకా
నేను బలిఅయినది?
కాదు కాదు... అసలే కాదు
దేనికి నేను బలి అయిందో
తెలియదా మీకు?

ఇంటికి చేరుతానని
ఇంటికి దీపమైతానని
నన్ను నడిపించిన ఆశ
విగతజీవిగా మారి
కన్నవారికి మిగిల్చిన నిరాశ

కారకులెవరో కనుక్కోండని
ప్రశ్నగా మారి వెళుతున్న...

click me!