వస్తు శిల్పాలలో వైవిధ్యాన్ని చూపిన అనేక కథలు వచ్చాయి. ఈ పోటీలో కథల ఎంపికకు కె.పి.అశోక్‌కుమార్, వంశీకృష్ణ, సిహెచ్ లక్ష్మణ చక్రవర్తి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు.
దసరా రోజున పాలపిట్ట దర్శనం తెలుగువారికి ఆనందదాయకం. ఈ సందర్భాన్ని ఒక సాహిత్య ఉత్సవంగా మలచాలన్న సంకల్పంతో పాలపిట్ట-జైనీ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ సంయుక్తంగా దసరా కథల పోటీని నిర్వహించాలని తలపెట్టి రచయితలని ఆహ్వానించాయి. జూన్ ఆఖరున తీసుకున్న ఈ నిర్ణయానికి వివిధ పత్రికలు, వెబ్‌సైట్లు, వాట్సాప్ గ్రూపులు స్వాగతించి పదగురికి తెలియజేయడానికి సహకరించాయి. తెలుగు ప్రాంతాలవారే గాక దేశంలోని వివిధ నగరాలనించి, విదేశాలలో ఉన్నవారి నుంచి మంచి స్పందన లభించింది. దాదాపు 350 మందికి పైగా కథలు వచ్చాయి. ఈ అనూహ్యమైన స్పందన పాలపిట్టకు కొత్త అనుభవం. వస్తు శిల్పాలలో వైవిధ్యాన్ని చూపిన అనేక కథలు వచ్చాయి. ఈ పోటీలో కథల ఎంపికకు కె.పి.అశోక్‌కుమార్, వంశీకృష్ణ, సిహెచ్ లక్ష్మణ చక్రవర్తి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. తెలుగునాట వర్తమాన కథకుల కథనరీతులను, వారి సృజనాత్మక స్పందనలను తెలుసుకోడానికి ఈ పోటీ ఉపయోగపడింది. ఇవాళ వస్తున్న కథల తీరుతెన్నులను అవలోకించడానికి ఈ కథల పఠనానుభవం తోడ్పడింది. పేజీల పరిమితి గానీ, వస్తువులకు పరిధులు గానీ పెట్టలేదు. ఎలాంటి షరతులు లేకుండా కథకుల అభివ్యక్తి స్వేచ్ఛను గౌరవించింది పాలపిట్ట. ఈ పోటీ కోసం కథలు పంపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఎంపికయిన కథల వివరాలు ఇక్కడ... మున్ముందు ఇలాంటి ప్రయత్నాలకు సాహిత్యలోకం సహకరిస్తుందన్నది ఆకాంక్ష. ఎంపికయిన కథల ప్రచురణ పరంపర రాబోయే సంచిక నుంచి ప్రారంభమవుతుంది.
ప్రథమ బహుమతి - రబ్బరు బొమ్మ - బి. నర్సన్
ద్వితీయ బహుమతి - కురుక్షేత్రం - ఎం.వి.రామిరెడ్డి
మూడో బహుమతి - జరా మరణ దుఖేనా... - కోట్ల వనజాత
ప్రత్యేక బహుమతులు
1. సన్యాసి ! నువ్వు తిరిగి రావాలి - మల్లిపురం జగదీష్
2. గోడ - సుంకోజు దేవేంద్రాచారి
3. నీరాజనం - గంటి రమాదేవి
4. అనేకానేక బల్లులు ఒకే ఒక్క ష్లాష్ బ్యాక్ - దేశరాజు
5. పాత్ర - జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి
6. నేలజారిన ముగ్ధత్వం - గంటి భానుమతి
7. దృక్పథం - విజయలక్ష్మీ పండిట్
8. మరో మలుపు - అమ్జద్
9. తల్లి ప్రాణం - పొత్తూరి విజయలక్ష్మి
10. సాక్షీభూతం - అప్పరాజు నాగజ్యోతి
సాధారణ ప్రచురణకు స్వీకరించిన కథలు
1. కుంజర యుధంబు - గండ్రకోట సూర్యనారాయణ శర్మ
2. పొదరింట్లో పాము - ఎం.ఏ. పద్మనాభరావు
3. ప్రేమంటే - పి.వి.ఎస్.కృష్ణకుమారి
4. ఇక్కడికే - ఉపాధ్యాయుల విజయశేఖర్
5. నవ్వుల వంశీ - రెడ్డి రామకృష్ణ
6. మాంగల్యం ఒక తంతేనా? - తటవర్తి నాగేశ్వరి
7. అబూమియా - సి.ఎస్.రాంబాబు
8. మానవులమే - కిషన్ పిన్నంశెట్టి
9. ఉన్న ఊరు కన్న తల్లి - చిత్తలూరి సత్యనారాయణ
10. పొడుస్తున్న పొద్దు - నామని సుజనాదేవి
11. వెన్నెలమాటున - ఎం.వి.జె. భువనేశ్వరరావు
12. అల్లాడి శ్రీనివాస్ - తల్లివేరు
13. పేలిన మంచు పర్వతం -పద్మావతి రాంభక్త
14. ఉసురు - గన్నవరపు నరసింహమూర్తి
15. డబ్బు జబ్బు - మంచికంటి
16. అట్లా అని పెద్ద బాధా ఉండదు - దాట్ల దేవదానం రాజు
17. అమ్మకు జేజేలు - ఆర్.సి.కె. రాజు
18. మతత్వం - మానవత్వం - అంబల్ల జనార్దన్
19. గంపకింది కొడిపెట్ట - వడలి రాధాకృష్ణ
20. సదువుల నాగమ్మ జేజమ్మ - కె. అరుణ