సి.శేఖర్(సియస్సార్) తెలుగు కవిత: ఇంకెంత కాలం?

Published : Oct 23, 2020, 02:27 PM IST
సి.శేఖర్(సియస్సార్) తెలుగు కవిత: ఇంకెంత కాలం?

సారాంశం

సీ. శేఖర్ ఇంకెంత కాలం అనే కవితను రాశారు. ఏషియానెట్ న్యూస్ పాఠకుల కోసం దాన్ని ఇక్కడ అందిస్తున్నాం

ధరిత్రి దద్దరిల్లుతోంది
బరువెక్కిన వదనంతో
ఎదలో తీరని వేదనతో
పచ్చని ప్రకృతితో అలరారే
పుడమంతా సముద్రాలింకిపోయి
జన సంద్రం జగతి నిండే
అవనంతా అయోమయం
అభివృద్ధి మాటులో 
కాలుష్యం కోరలు 
ఆహారోత్పత్తిలో కల్తీ రాజ్యం
రోజుకో మాయదారి రోగం
మానవజాతిని మట్టుపెడుతుంది
ఓ వైపు కాలం మారి
మనపై దండెత్తి దాడిచేస్తుంది
మనిషికి కనబడని వైరస్లతో
అల్లాడి ఆయువు తీస్తుంది
మరోవైపు వరదలు 
కల్లోలం రేపుతున్నాయి
ఎడతెరిపి లేకుండా
వేట మొదలెట్టింది
సంద్రమై శవాలు కాలువలుగా
పరుగుతిస్తున్నాయి.

PREV
click me!

Recommended Stories

Tim Cook books టిమ్ కుక్ ని మార్చేసిన పుస్తకాలు.. చదివితే మనకూ స్ఫూర్తి పాఠాలు
అపరాజిత అయోధ్య : రామాలయ చరిత్ర, శతాబ్దాల పోరాటం