స్థాయి సినారె పురస్కారం 2021 సంవత్సరానికి గాను అన్నవరం దేవేందర్ ' గవాయి ' కవితా సంపుటి ఎంపికైనట్లు సినారె పురస్కార కమిటీ చైర్మన్ డాక్టర్ ఎడవెల్లి విజయేంద్ర రెడ్డి ఒక ప్రకటనలో తెలియజేశారు.
జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డా. సి.నారాయణరెడ్డి పేరుమీద ప్రతి ఏటా ఇస్తున్న రెండు తెలుగు రాష్ట్రాల స్థాయి సినారె పురస్కారం 2021 సంవత్సరానికి గాను అన్నవరం దేవేందర్ ' గవాయి ' కవితా సంపుటి ఎంపికైనట్లు సినారె పురస్కార కమిటీ చైర్మన్ డాక్టర్ ఎడవెల్లి విజయేంద్ర రెడ్డి ఒక ప్రకటనలో తెలియజేశారు.
అన్నవరం దేవేందర్ కరీంనగర్ జిల్లాకు చెందిన కవి. ఇప్పటికీ తాను పదిహేను పుస్తకాలు వెలువరించారు. పలు సాహిత్య కార్యక్రమాలలో క్రియాశీలక పాత్ర పోషించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంతో సహా పలు ప్రజా ఉద్యమాలకు తన కవిత్వాన్ని అందించి ప్రజలను చైతన్యవంతులను చేయడంలో ముందు వరుసలో ఉన్న కవి అన్నవరం దేవేందర్.
రెండు రాష్ట్రాల నుంచి ఈ పురస్కారానికి 78 ఎంట్రీలు రాగా ముగ్గురు న్యాయనిర్ణేతల నిర్ణయం మేరకు ' గవాయి ' ఎంపికైనట్లు సాహితీ గౌతమి అధ్యక్షులు డాక్టర్ గండ్ర లక్ష్మణరావు తెలిపారు. సాహితీ గౌతమి (జిల్లా సాహితీ సంస్థల సమాఖ్య)కరీంనగర్ గత 37 సంవత్సరాలుగా కవిత్వానికి ప్రదానం చేస్తున్న ప్రతిష్టాత్మకమైన పురస్కారం ఇది. ప్రధానోత్సవం సభ త్వరలో ఉంటుంది అని నిర్వాహకులు తెలిపారు.