గోపగాని రవీందర్ కవిత : అక్షరాల ఉత్తేజం..!

Siva Kodati |  
Published : Jan 12, 2024, 02:19 PM IST
గోపగాని రవీందర్ కవిత : అక్షరాల ఉత్తేజం..!

సారాంశం

హత్తుకుంటున్న ప్రతి ప్రేమను, దుఃఖాన్ని గొంతెత్తి పాడాలనిపిస్తుంది అంటూ గోపగాని రవీందర్ రాసిన కవిత  ' అక్షరాల ఉత్తేజం..!' ఇక్కడ చదవండి : 

ఒక రోజు గడిచిపోయింది
ఇదొక పెద్ద విషయం కాకపోవచ్చు
విపులంగా చెప్పుకోవడానికి 
అనువైన విశేషణాలు లేకపోవచ్చు
క్షణక్షణాల్లోని అనుభూతి 
అపరిమితమైన ఆశల కాంతి రేఖ..!

మనసు నిండా
చిందరవందరైన ఆలోచనలను 
దారంతో పూలమాలను అలినట్లుగా
ఒక సుమధురమైన విధానం కోసం ఆరాటం
ఏదీ మన మాట విన్నట్లుగా ఉండదు
మన దరికి రానట్లుగానే ఉంటుంది
దొర్లుకుంటు పోవాల్సిందే మునుముందుకు..!

పలకరిస్తున్న ప్రతి దృశ్యాన్ని
అక్షరమయం చేయడమొక అలవాటు
హత్తుకుంటున్న ప్రతి ప్రేమను, దుఃఖాన్ని
గొంతెత్తి పాడాలనిపిస్తుంది
దీన గాథలకు రెక్కలు తొడగాలనిపిస్తుంది
అనునిత్యం అక్షరాల ఉత్తేజం
తనువంతా రక్తంలా ప్రవహిస్తూనే ఉంటుంది..!

PREV
click me!

Recommended Stories

Tim Cook books టిమ్ కుక్ ని మార్చేసిన పుస్తకాలు.. చదివితే మనకూ స్ఫూర్తి పాఠాలు
అపరాజిత అయోధ్య : రామాలయ చరిత్ర, శతాబ్దాల పోరాటం