ఆచార్య వాసిరెడ్డి భాస్కర రావు స్మారక సాహితీ పురస్కారం - 2023 ప్రదానోత్సవం ఈ రోజు ఉదయం హన్మకొండలో జరిగింది. పూర్తి వివరాలకు ఇక్కడ చదవండి
అరసం వరంగల్ ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం జరిగిన సమావేశంలో డా. రమణ యశస్వి మరియు నెట్లుట్ల రమాదేవి గార్లకు సంయుక్తంగా ఆచార్య వాసిరెడ్డి భాస్కర రావు స్మారక సాహితీ పురస్కారం అందజేశారు. ఈ సమావేశం అరసం వరంగల్ అధ్యక్షులు నిధి బ్రహ్మచారి అధ్యక్షతన ప్రభుత్వ అభ్యసన ప్రాథమిక పాఠశాల, లష్కర్ బజార్, హన్మకొండలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన అరసం జాతీయ కార్యదర్శి వేల్పుల నారయణ మాట్లాడుతూ కథ ఎవరికోసం రాస్తున్నామో వారి జీవితం మార్చేదిగా ఉండలన్నారు.
పది సంవత్సరాలుగా క్రమం తప్పకుండా అరసం వరంగల్ వారు భాస్కరరావు పేరు పై అవార్డ్ ఇవ్వడం అభినందనీయం అన్నారు. అవార్డ్ పొందిన కథా సంపూటలు డా॥ రమణ యశస్వి “మా గణపవరం కథలు”ను డా॥ వాసిరెడ్డి కృష్ణారావు పరిచయం చేయగా, నెల్లుట్ల రామదేవి “తల్లి వేరు” ను ఏలేశ్వరం వెంకటేశ్ పరిచయం చేశారు.
undefined
పురస్కార గ్రహీతలు తమ స్పందనలో అరసం బహుకరించే ఈ ప్రతిష్టాత్మక పురస్కారం తమకు రావడం గర్వంగా ఉందన్నారు. ఇటీవల అరసం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా పల్లేరు వీరస్వామి ఎన్నికైన సందర్భంగా వారిని ఈ సమావేశంలో అరసం వరంగల్ తో పాటుగా శ్రీలేఖ సాహితి, వల్లపట్ల ఆర్ట్స్ అకాడమి, తెలంగాణ రచయితల సంఘం, పరకాల సాహితి సమితి, కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ, పరకాల సాహితి సమితి తదితర సంస్థలు మిత్రులు ఘనంగా సత్కరించారు.
ఈ సమవేశానికి బూర భిక్షపతి స్వాగతం పలుకగా డా॥శంకర్ నారయణ కృతఙ్ఞతలు తెలిపారు. సమావేశంలో ప్రముఖ సాహితి వేత్తలు డా॥ టి శ్రీరంగస్వామి, వల్లంపట్ల నాగేశ్వర్ రావు, చందు, అన్వర్ , అమ్మిన శ్రీనివాస్, బాలబోయిన రమాదేవి, బిల్ల మహేందర్, రాకుమార, డా॥భండారు సుజాత, వి. పద్మావతి, మాదారపు వాణిశ్రీ, డా॥ఆకూనూరి విద్యాదేవి, ఎర్ర ప్రసన్న, శైలజ, బిట్ల అంజని దేవి, లేనిన్, క్రాంతి, రాజు మొదలగువారు పాల్గొన్నారు .