నేను , గాంధి మరియు మా మాస్టర్

By telugu team  |  First Published Oct 2, 2019, 12:36 PM IST

గాంధీ జయంతి సందర్భంగా పి. లంకేష్ రాసిన కన్నడ కవితకు ఎస్డీ కుమార్ చేసిన తెలుగు అనువాదాన్ని ఇక్కడ ఇస్తున్నాం. నేను, గాంధీ మరియు మా మాస్టర్ అనే కవితను చదవండి.


నేను , గాంధి మరియు మా మాస్టర్ 

మహాత్ముడు ఇప్పుడు ఈ పద్యం చెపుతున్నప్పుడే చచ్చిపోతే 
నా ఆత్మ చేయిచాచి స్తంభాలను స్పర్శిస్తుందా ? 
లేక నిలచి మేఘం , మెరుపులను చూస్తుందా ? 
లేక గాలివానకు, భూకంపానికి వణుకుతుందా ? 

Latest Videos

ఈ ప్రశ్నల చుట్టూ తిరిగే మనసు 
ఇరవై సంవత్సరాల క్రితం........
మిడ్ల్ స్కూల్....ఉదయం...
మాస్టర్ విచ్చేశారు తరగతికి 
కిటికి ఆవల అగ్గిలాంటి ఎండ 
మాస్టర్ ముఖం చప్పగా ఉంది : చెప్పారు - 
' మహాత్ముడు వెళ్ళిపోయాడు ' 
- గొప్ప న్యూస్ అయి ఉండాలి , శెలవిచ్చారు ; 
ఆ తరువాత చాలారోజులు ఏడుస్తూ ఏడుస్తూ పాఠం చెబుతుంటే తమాషాగా ఉండేది...ఇప్పటికీ బాగా గుర్తు : నెత్తిమీద పేటా , గద్దముక్కు, పెద్ద కళ్ల, మడతల గొంతు, పాతకోటు....మా మాస్టారు...

రోజురోజుకూ కృశించి ఆ చలికాలంలో 
చనిపోయాడు 
నాకు చాలా భయమేసింది 
ఆయన మాయమయ్యడని , హఠాత్తుగా ఇక తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడని విని...

మహాత్ముడు చనిపోయాడని ఇతనూ చచ్చిపోయాడా ? 
నా భుజం తట్టి, కథలు చెప్పిన, బెత్త్ంతో స్తోత్రాలు చెప్పించిన మాస్టర్ ఇక లేరా ?  

హింసతో విరిసి ఎదిగే విత్తననం 
దాని బలవంతానికి చీలుకునే భూమి 
నెత్తుట్లోంచి తేలి  శుభోదయం చెప్పే సూర్యుడు 
పిడుగులా గుద్ది, సకిలించి చినుకులేసే మేఘం 
ఉప్పొంగి, చెలరేగి, పిచ్చిగా పడిలేస్తూ తిని - తినిపించే సముద్రం  
నేలకురాచే వర్షం 
వర్షాన్ని తోసే గాలి..........

దీనికేమి చెప్పాలి మహాత్మా ? చావుకు నీవే కారణమా ? సత్యమెంత అహింస ఎంత ? ఉష్ణవలయపు శాఖం ? అస్తవ్యస్తం ? ద్వంద్వమయపు ప్రపంచానికి సత్యం అర్థంకాదు మహాత్మ : అన్నం సత్యమవదు రా 
ముగిసిపోవడానికి అంధకుడు ,
వికలాంగుడవడానికి...
పదితలలు పడిపోయి పుట్ట చిగురించే ..
ఈ స్థలంలో ...బూడిదచేసే అగ్గి, మునిగించేసే నీళ్ళు, పగిలే భూమి....
నువ్వు మరియు మాస్టర్ చనిపోతే...
మట్టి సారవంతమైనదా లేక మైదానంలో వెలుగు ? 
చూస్తూ....ప్రారంభిస్తాము మళ్ళీ పోలీరాగం

కన్నడ మూలం: పి. లంకేష్

తెలుగు సేత: ఎస్ డీ కుమార్

click me!