ఈ ఏడాది పెళ్లిళ్లలకు దివ్యమైన ముహుర్తాలు ఇవే...

Published : Feb 05, 2019, 02:13 PM ISTUpdated : Feb 05, 2019, 02:42 PM IST
ఈ ఏడాది పెళ్లిళ్లలకు దివ్యమైన ముహుర్తాలు ఇవే...

సారాంశం

ఈ నూతన సంవత్సరంలో 8నెలల పాటు దివ్యమైన పెళ్లి ముహుర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. 

ఈ నూతన సంవత్సరంలో 8నెలల పాటు దివ్యమైన పెళ్లి ముహుర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. 4నెలలు మినహాయించి.. మిగిలిన అన్ని నెలల్లో పెళ్లిళ్లు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఫిబ్రవరి నెల నుంచి పెళ్లిళ్ల సీజన్ మొదలు కానుంది. ఫిబ్రవరి నెలలో 6,7,8,9,10,11,13,14,17,21,23,24 తేదీలు, మార్చి నెలలో 2,7,8,9,10,13,14,17,21,24,29 తేదీలు, మే నెలలో 8,12,15,16,17,19,23,24,25,26,27,29,30 తేదీలల్లో, జూన్ నెలలో 8,9,12,13,15,16,19,20,21,22,23,26,27 తేదీల్లో వివాహ ముహూర్తాలు ఉన్నాయి. 

ఏప్రిల్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో ముహూర్తాలు లేవని  పండితులు చెబుతున్నారు. అక్టోబర్ నెలలో 5,9,10,12,13,17,18,19,23,24,30,31 తేదీలు, నవంబరు నెలలో 1,3,6,9,10,11,13,14,15,20,21,22,30 తేదీలు, డిసెంబరు నెలలో 1,2,5,6,7,8,11,12 తేదీలలో వివాహ ముహూర్తాలు ఉన్నాయన్నారు. ఈ శుభముహూర్తాలే కాక మరికొన్ని నామం, నక్షత్రంను బట్టి ముహూర్తాలు పెట్టుకోవచ్చన్నారు.
 

PREV
click me!

Recommended Stories

Chanakya Niti: పెళ్లికి సిద్ధ‌మ‌వుతున్నారా.? ఇలాంటి మ‌హిళ‌ల‌కు దూరంగా ఉండ‌డ‌మే మంచిది
చాణక్య నీతి ప్రకారం ఇలాంటి జీవిత భాగస్వామి ఉంటే జీవితాంతం కష్టాలే!