Induction Stove vs Gas: ఇండక్షన్ స్టవ్, గ్యాస్ సిలిండర్‌‍లో ఏది బెస్ట్? ఏది తక్కువ ఖర్చు?

Published : Mar 16, 2026, 04:06 PM IST
Gas Cylinder vs Induction

సారాంశం

గ్యాస్ సిలిండర్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో చాలామంది ఇండక్షన్ స్టవ్ వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే గ్యాస్‌తో పోలిస్తే ఇండక్షన్‌పై స్టవ్‍పై వంట చేయడం నిజంగా చౌకనా? అసలు ఇండక్షన్ స్టవ్ కి ఎంత కరెంట్ ఖర్చు అవుతుంది? అది ఎవరికి బెస్టో ఇక్కడ చూద్దాం.

ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య జరుగుతున్న గొడవల ఎఫెక్ట్ ఇప్పుడు మన వంటింట్లోనూ కనిపిస్తోంది. గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది. దీనికి తోడు చాలాచోట్ల బ్లాక్ మార్కెట్ వంటి సమస్యలతో గ్యాస్ దొరకడం కష్టంగా మారింది. ఈ పరిస్థితుల్లో చాలామంది కరెంట్‌తో పనిచేసే ఇండక్షన్ స్టవ్ పై వంట చేయడం మొదలుపెట్టారు. ఇండక్షన్‌పై వంట చేయడం చౌక, మోడ్రన్ అని కొందరు అంటుంటే.. లేదు లేదు, గ్యాస్ సిలిండరే బెస్ట్ అని మరికొందరు వాదిస్తున్నారు.

నిజానికి ఖర్చు అనేది కరెంట్ రేట్లు, గ్యాస్ సిలిండర్ ధర, రోజూ ఎంతసేపు వంట చేస్తామనే దానిపై ఆధారపడి ఉంటుంది. మరి ఈ రెండింటిలో దేనిపై వంట చేస్తే మన జేబుకు భారం తగ్గుతుందో ఇక్కడ చూద్దాం.

గ్యాస్ సిలిండర్‌పై వంట ఖర్చు ఎంత?

మన దేశంలో డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధర సుమారుగా 900 నుంచి 1100 రూపాయల మధ్యలో ఉంటోంది (నగరాలను బట్టి ధర మారుతుంది). ఒక మామూలు కుటుంబానికి ఒక సిలిండర్ దాదాపు 30 నుంచి 45 రోజులు వస్తుంది. అంటే, రోజువారీ వంట ఖర్చు సుమారు 30 నుంచి 40 రూపాయల వరకు పడుతుంది. అందుకే చాలా ఇళ్లలో ఇప్పటికీ గ్యాస్‌నే తక్కువ ఖర్చు అయ్యే ఆప్షన్‌గా చూస్తున్నారు.

ఇండక్షన్ స్టవ్ కరెంట్ ఎంత లాగుతుంది?

సాధారణంగా ఒక ఇండక్షన్ కుక్‌టాప్ 1200 నుంచి 2000 వాట్ల కరెంట్‌ను వాడుకుంటుంది. ఒక వ్యక్తి రోజూ గంట నుంచి గంటన్నర సేపు ఇండక్షన్‌పై వంట చేస్తే, నెలకు సుమారు 40 నుంచి 60 యూనిట్ల కరెంట్ ఖర్చవుతుంది. ఒక యూనిట్ కరెంట్ ధర 7-8 రూపాయలు అనుకుంటే, నెలవారీ ఖర్చు 280 నుంచి 480 రూపాయల వరకు ఉంటుంది. అదే, వాడకం పెరిగితే ఈ ఖర్చు ఇంకా ఎక్కువవుతుంది.

ఏ ఆప్షన్ ఎక్కువ ఖరీదైనది?

మీ ఇంట్లో కరెంట్ యూనిట్ రేటు ఎక్కువగా ఉండి, ఇండక్షన్‌ను ఎక్కువ సేపు వాడితే, అది గ్యాస్ సిలిండర్ కంటే ఖరీదైనదిగా మారుతుంది. అదే కొన్ని చోట్ల 150-200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తున్నారు కాబట్టి.. అలాంటి చోట్ల లేదా సోలార్ పవర్ వాడే ఇళ్లలో ఇండక్షన్‌తో వంట చేస్తే డబ్బు బాగా ఆదా అవుతుంది. కాబట్టి, ఖర్చు అనేది పూర్తిగా మీ ఏరియాలోని కరెంట్ రేటు, మీ వాడకంపైనే ఆధారపడి ఉంటుంది.

ఇండక్షన్, గ్యాస్.. లాభనష్టాలు

గ్యాస్ మీద వంట వేగంగా, మనం అలవాటుపడ్డ పద్ధతిలో చేసుకోవచ్చు. దీనికి కరెంట్ అవసరం లేదు. కానీ, సిలిండర్ మధ్యలో అయిపోతుందనే టెన్షన్, భద్రత విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మరోవైపు, ఇండక్షన్ కుక్‌టాప్ చాలా సురక్షితం, శుభ్రంగా ఉంటుంది, చూడటానికి కూడా మోడ్రన్‌గా ఉంటుంది. కానీ దీనికి ఇండక్షన్‌కు సపోర్ట్ చేసే ప్రత్యేకమైన గిన్నెలు కొనాలి, కరెంట్ కోతలు లేకుండా నిరంతరం పవర్ సప్లై ఉండాలి.

ఏది కొనడం కరెక్ట్?

మీ ఇంట్లో రోజూ ఎక్కువ వంట చేయాల్సి ఉండి, కరెంట్ రేట్లు కూడా ఎక్కువ ఉంటే, గ్యాస్ సిలిండరే మీకు సరైన ఆప్షన్. అదే, చిన్న కుటుంబాలు, హాస్టళ్లలో ఉండేవారు లేదా కరెంట్ చౌకగా దొరికే ప్రాంతాల్లో నివసించేవారికి ఇండక్షన్ స్టవ్ సౌకర్యవంతంగా, చౌకగా ఉంటుంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Ugadi Festival 2026: ఉగాది రోజు పూజ ఎప్పుడు చేయాలి? పండితులు చెప్పిన శుభ మూహుర్తం ఇదే.
Glowing Skin: కలబందలో ఇవి కలిపి రాస్తే.. ముఖం చిటికెలో మెరిసిపోతుంది!