
గర్భాశయ శ్లేష్మాన్ని పనికిరాని ద్రవంగా చూస్తారు చాలా మంది. కానీ దీనివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారని నిపుణులు చెబుతున్నారు. గర్భాశయాన్ని తెరిచే ఇది యోని ఉత్సర్గగా బయటకు వస్తుంది. గర్భాశయ శ్లేష్మం జిగటగా, క్రీమీగా, వాటర్ గా, చిక్కగా ఉంటుంది. దీనికి సాగే గుణం కూడా ఉంటుంది. శ్లేష్మం ఇలా మారడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. అయితే ఈస్ట్రోజెన్ వంటి హార్మోన్ల ద్వారా ఈ శ్లేష్మం కూర్పు, దాని నాణ్యత ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
అయితే పీరియడ్స్ తర్వాత గర్భాశయ శ్లేష్మం ఉత్పత్తి చాలా వరకు తగ్గుతుంది. దీనివల్ల కొంతమంది మహిళలకు యోని పొడిబారుతుంది. మళ్లీ కొన్ని రోజుల తర్వాత శ్లేష్మం ఉత్పత్తి పెరుగుతుంది. శ్లేష్మం పసుపు లేదా తెలుపు రంగులో జిగటగా ఉంటుంది.
అండోత్సర్గం సమయంలో అండాశయం నుంచి పరిపక్వ అండం విడుదలయ్యే ప్రక్రియ వరకు గర్భాశయ శ్లేష్మం పెరుగుతుంది. అండం విడుదలైన తర్వాత ఇది ఫెలోపియన్ ట్యూబ్ ద్వారా ప్రయాణించి 12 నుంచి 24 గంటలు అక్కడే ఉంటుంది. అక్కడ ఫలదీకరణం చెందుతుంది. అలాగే గర్భాశయ శ్లేష్మం ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో శ్లేష్మం రంగు గుడ్డులోని తెల్లసొన మాదిరిగా ఉంటుంది. అండోత్సర్గం తర్వాత గర్భాశయ శ్లేష్మ పరిమాణం తగ్గుతుంది.
రుతుచక్రంలో గర్భాశయ శ్లేష్మం ఎన్నో మార్పులకు లోనవుతుంది. ఇది సాధారణ అండోత్సర్గము సంకేతాన్ని సూచిస్తుంది. గర్భాశయ ద్రవం అండాన్ని ఫలదీకరణం చేయడానికి, వీర్యాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి, వీర్యం గర్భాశయం వైపు కదలడానికి సహాయపడుతుంది. గర్భాశయంలోని గుడ్డు ఫోలికల్ అని పిలువబడే ఎన్ క్లోజర్ లోపల పెరుగుతుంది. ఫోలికల్ ఈస్ట్రోజెన్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది గర్భాశయాన్ని మృదువుగా చేస్తుంది. అలాగే దాన్ని కొద్దిగా తెరుస్తుంది. ఫోలికల్ చీలిపోయినప్పుడు శరీరం అండోత్సర్గము ప్రక్రియకు లోనవుతుంది. అక్కడ గుడ్డు విడుదల అవుతుంది. గర్భాశయ ద్రవం ఆకృతిని మార్చడంలో ఈస్ట్రోజెన్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇది సంతానోత్పత్తికి మద్దతునిస్తుంది.
అయితే మీరు మీ గర్భాశయ శ్లేష్మంలో మార్పులను గుర్తించడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది మీరు అండోత్సర్గము, గర్భందాల్చే కాలాన్ని గుర్తించడానికి సహాయపడుతుంది. మీ గర్భాశయ శ్లేష్మంలో ఏవైనా మార్పులు లేదా సంక్రమణ సంకేతాలను మీరు గమనించినట్టైతే వెంటనే వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం. గర్భాశయ శ్లేష్మం సాధారణంగా ఎలాంటి వాసన ఉండదు. ఒకవేళ ఇది దుర్వాసన కలిగి ఉంటే.. అది సంక్రమణ లక్షణాలను గుర్తించాలి. పసుపు, ఆకుపచ్చ లేదా బూడిద రంగులో ఉండే గర్భాశయ శ్లేష్మం సంక్రమణకు లక్షణాలు. లేదా యోని దగ్గర దురద లేదా మంటగా లేదా వాసన కూడా రావొచ్చు.
గర్భాశయ శ్లేష్మం చాలా చాలా అవసరం. ఎందుకంటే ఇది సంతానోత్తత్తికి ఎంతో ఉపయోగపడుతుంది. ఇది స్పెర్మ్ ను ఆరోగ్యంగా ఉంచతుంది. ఒక మహిళ అండోత్సర్గం కాలానికి చేరుకున్నప్పుడు గర్భాశయ శ్లేష్మం ఉత్పత్తికి బాధ్యత వహించే హార్మోన్ ఈస్ట్రోజెన్ గరిష్ట స్థాయికి చేరుకోవడం ప్రారంభిస్తుంది. ఈ సమయంలో గర్భాశయ శ్లేష్మం పేస్ట్, క్రీమీ ఆకృతి నుంచి గుడ్డులోని తెల్లసొనను పోలిన సాగదీసిన శ్లేష్మంగా మారుతుంది. జారిపోయే, తడి, గుడ్డు-తెలుపు శ్లేష్మం సాగదీసిన స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఇది స్పెర్మ్ కణాలు గర్భాశయం గుండా కదిలే సామర్థ్యాన్ని పెంచుతుంది. దీనివల్ల గర్భందాల్చే అవకాశాలు పెరుగుతాయి.
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. గర్భధారణకు గర్భాశయ శ్లేష్మం చాలా అవసరం. ఎందుకంటే ఇది స్పెర్మ్ ను వృద్ధి చెందడానికి, స్వేచ్ఛగా కదలడానికి అనువైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. గర్భాశయ శ్లేష్మం తక్కువగా లేదా మొత్తమే లేకపోతే యోని పొడిబారుతుంది. ఇది గర్భవతి అయ్యే మీ సామర్థ్యాన్ని తగ్గిస్తుంది.