
వరుసగా పండుగలు వచ్చేస్తున్నాయి. కొత్త బట్టలతో పాటు నగలు కూడా సిద్ధం చేసుకోవాలి. ఇక మహిళలకు మంగళసూత్రం ఎంతో ప్రత్యేకమైనది. వివాహమైన ఆడవాళ్లకు నల్లపూసలు మంగళసూత్రం ముఖ్యమైనది. నల్ల పూసలు మెడలో వేసుకుంటే ఎంతో కళగా ఉంటుంది. ఇప్పుడు బంగారు ధరలు పెరిగిపోయాయి కాబట్టి నల్ల పూసల మంగళసూత్రం కొనడం కష్టమే. లక్షల్లో ఖర్చు అవుతుంది. అలాంటి వారు గోల్డ్ ప్లేటెడ్ నల్ల పూసల మంగళసూత్రలు ఎంపిక చేసుకోవచ్చు. రెండు వేల రూపాయలలోపే అందమైన డిజైన్లు దొరుకుతాయి. కొన్ని డిజైన్లు ఇక్కడ ఇచ్చాము చూడండి.
కొత్త డిజైన్ మంగళసూత్రం వేసుకోవాలనుకుంటే ఈ లక్ష్మీ రూపు ఉన్న కాసు మంగళసూత్రం బాగుంటుంది. నల్ల పూసలతో పాటు, రకరకాల షేప్ లాకెట్లు, కాసుల్లాంటి పెండెంట్లు ఉంటాయి. కుందన్లు, బంగారు పూసలు కూడా ఉంటాయి. మార్కెట్లో ఎన్నో రకాల డిజైన్లు లభిస్తున్నాయి. వీటికి మ్యాచింగ్ చెవి రింగులు కూడా దొరుకుతాయి. వీటిని ధరిస్తే లక్ష్మీదేవిలా ఆడవాళ్లు మెరిసిపోవడం ఖాయం.
ట్రెడిషనల్ లుక్ తో పాటు మోడ్రన్ టచ్ కావాలంటే ఇలాంటి మంగళసూత్రం డిజైన్లు ఎంచుకుంటే బాగుంటుంది. కుందన్లు, పెండెంట్ పైన చక్కని వర్క్ తో ఇవి మార్కెట్లో లభిస్తున్నాయి. ఉంటుంది. కొన్ని డిజైన్లలో నల్ల పూసలు ఎక్కువగా, మరికొన్నింటిలో తక్కువగా ఉంటాయి. ఎలా అయినా ఇవి అందంగా ఉంటాయి. ఏ డ్రెస్ మీద అయినా ఈ మంగళసూత్రం డిజైన్లు బాగుంటాయి.
టెంపుల్ స్టైల్ మంగళసూత్రాలు చూసేందుకు చాలా కళగా ఉంటాయి. దక్షిణాదిలో ఇలాంటి డిజైన్లు ఎంతో ఫేమస్ అయ్యాయి. ఇప్పుడు ఉత్తరాదిలో కూడా ఇవి ఎక్కువమందిని ఆకర్షిస్తున్నాయి. నల్ల పూసలతో పాటు లక్ష్మీదేవి పెండెంట్, విష్ణువు వంటి పెండెంట్ ఉంటాయి. నిజమైన బంగారంతో చేసినవి కొంటె వీటి ధర లక్షల్లో ఉంటుంది. కానీ గోల్డ్ ప్లేటెడ్ అయితే రెండు వేల రూపాయలలోపే దొరుకుతాయి. చీరల మీదకు ఇవి ఎంతో కళగా ఉంటాయి.