భోజనం మధ్యలో మంచినీళ్లు తాగితే...

By telugu teamFirst Published May 20, 2019, 3:18 PM IST
Highlights

పిల్లలు ఎవరైనా భోజనం మధ్యలో మంచి నీళ్లుతాగితే ఇంట్లో పెద్దవాలు వారిస్తారు. ఎందుకూ అంటే... ఆరోగ్యానికి మంచిది కాదని.. తిన్న ఆహారం అరగదని.. ఇలా రకరకాలుగా చెబుతుంటారు. 

పిల్లలు ఎవరైనా భోజనం మధ్యలో మంచి నీళ్లుతాగితే ఇంట్లో పెద్దవాలు వారిస్తారు. ఎందుకూ అంటే... ఆరోగ్యానికి మంచిది కాదని.. తిన్న ఆహారం అరగదని.. ఇలా రకరకాలుగా చెబుతుంటారు. కాగా... దీనిపై నిపుణులు స్పష్టత ఇచ్చారు. నిజంగానే భోజనం మధ్యలో నీరు తాగకూడదని తేల్చిచెప్పారు.

తగిన మోతాదులో నీళ్లు తాగడం ఆరోగ్యానికి ఎంతో అవసరం.  భోజనం చేస్తున్నప్పుడు  చాలా మందికి వెంట వెంటనే  నీళ్లు తాగాలనిపించడానికి కారణం...  మిగతా సమయాల్లో సరిగ్గా తీసుకోకపోవడమే. ఒంట్లో నీరు కరువైతే... భోజన సమయంలో నోట్లో ఉత్పత్తి అయ్యే లాలాజలం సరిపోదు. దీంతో, ఇంకొన్ని నీళ్లు తాగాల్సి వస్తుంది. అలాగే భోజనంలో సాంబారు, రసం, మజ్జిగ లాంటి ద్రవ పదార్థాలు ఉన్నప్పుడు నీళ్లు ఎక్కువగా తాగాల్సిన అవసరం రాదు. 

వంటలో ఉప్పు, కారం అధికంగా ఉంటే కూడా.. ముద్దముద్దకూ నీళ్లు తాగాలనిపిస్తుంది. తినేటప్పుడు కొద్దిగా నీళ్లు తాగడం వల్ల నష్టమేమీ ఉండదు. అలా అని, మరీ ఎక్కువగా తాగినా ఇబ్బందే. దీనివల్ల జీర్ణక్రియ కొద్దిగా ఆలస్యమయ్యే ఆస్కారం ఉంది. ఈ పరిస్థితి రాకుండా ఉండటానికి ఒకేసారి కాకుండా, గంటకొకసారి కొద్ది మోతాదులో తీసుకుంటే మంచిది. 

భోజనానికి ఓ అరగంట ముందే కొన్నినీళ్లు తాగితే సరిపోతుంది. అలాగే తిన్న తర్వాత కూడా అరగంట సమయమిచ్చి తాగితే అసౌకర్యంగా అనిపించదు. ఉప్పు, కారం, మసాలాలు తగ్గించుకోవడమూ మంచిదే.

click me!