బతుకమ్మ జస్ట్ ప్రాంతీయ పండుగ మాత్రమే కాదు.. ఈ విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు

Published : Oct 12, 2023, 03:34 PM IST
 బతుకమ్మ జస్ట్ ప్రాంతీయ పండుగ మాత్రమే కాదు.. ఈ విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు

సారాంశం

Bathukamma 2023:  ప్రకృతితో జరుపుకునే పండుగ బతుకమ్మ పండుగ. ప్రేమతో, ప్రకృతితో, మన జీవితంతో, సోదరభావంతో మనకున్న అనుబంధాన్ని చాటిచెప్పే పూల పండగే బతుకమ్మ.  

Bathukamma 2023:  బతుకమ్మ వస్తుందంటే చాలు ఆడవాళ్లకు ఎక్కడ లేని సంతోషం కలుగుతుంది. ఎంగిలి బతుకమ్మ నుంచి సద్దుల బతుకమ్మ వరకు రోజూ తీరొక్క పువ్వులతో అందంగా బతుకమ్మను తయారుచేస్తారు. ఇక సద్దుల బతుకమ్మకైతే ఎంతో పూవును పోగేస్తుంటారు ఇప్పటినుంచే. బతుకమ్మ కేవలం ఒక పండుగ మాత్రమే కాదు. ఈ పండుగ సంబంధాలను పెంచతుంది. ప్రకృతి పట్ల మనకున్న ప్రేమను పెంచుతుంది. అంతకు మించి ఈ పూల పండుగ మనకు ఎంతో మేలు చేస్తుంది. 

ప్రకృతితో, ప్రేమతో, జీవితంతో, సోదరభావంతో మనకున్న అనుబంధాన్ని చాటిచెప్పే పూల పండుగ బతుకమ్మ. భారతదేశంలో ఒక ప్రాంతీయ పండుగగా కనిపించే ఈ పండుగ ఎన్నో శాస్త్రీయ విలువను కూడా కలిగి ఉందన్న ముచ్చట మీకు తెలుసా

గుండ్రంగా వలయాల్లో వరుసగా పూలను పేరుస్తై.. గోపురం మాదిరిగా బతుకమ్మను తయారుచేస్తారు. గునుగు పూలు, తంగేడు పూలు, తామర పూలు, బంతి పూలు, గుమ్మడి పూలు అంటూ తీరొక్క పూలతో బతుకమ్మను అందంగా, ఆడపడులా తీర్చిదిద్దుతారు. తాము తయారుచేసిన బతుకమ్మను చంటిపిల్లలను చూసి మురిసినట్టే మురిసిపోతారు. అయితే బతుకమ్మను ఉపయోగించే పువ్వులు, ఆకుల్లో ఎన్నో ఔషదగుణాలుంటాయని నిపుణులు చెబుతున్నారు. అవును వీటిని నీటిని శుభ్రపరిచే గుణాలుంటాయి. పర్యావరణానికి ఎంతో మేలు చేస్తాయి. 

మీకు తెలుసా? బతుకమ్మను స్థానికంగా లభించే పూలతోనే తయారుచేస్తారు. అయితే పువ్వులు సహజంగా రీసైకిల్ చేయబడిన ఉత్పత్తులు. అవి ప్రకృతి నుంచి వచ్చి ప్రకృతిలోనే కలిసిపోతాయి. అయితే వాటిలో ప్రతిదానికి ఒక్కో ప్రత్యేకమైన విలువ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. బతుకమ్మలను నీటిలో నిమజ్జనం చేయడం వల్ల ఎలాంటి హాని జరగదు. కానీ నీటిని ఎంతో మేలు జరుగుతుంది. 

నవరాత్రులలో తొమ్మిది రోజుల పాటు బతుకమ్మను తయారుచేయడానికి ఉపయోగించే బంతిపూలు, మందార పువ్వులు, చామంతి పువ్వులు, గులాబీ పువ్వులు, గునుగు పువ్వులు, తంగేడు పువ్వులు, గుమ్మడిపువ్వులు వంటి ప్రాంతీయంగా లభించే పువ్వుల్లో ఎన్నో ఔషదగుణాలుంటాయి. 

గునుగు, తంగేడు పువ్వుల్లో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. అందుకే వీటిని ఎన్నో మందుల తయారీలో ఉపయోగిస్తారు. గుమ్మడి పువ్వుల్లో కూడా యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇక మందారంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. గన్నేరు పువ్వు కుష్టువ్యాధి చికిత్సకు ఉపయోగిస్తారు. ఈ పూలన్నీ మంచి మాత్రమే చేస్తాయని.. బతుకమ్మ ఒక రకంగా వాటిని హైలైట్ చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

సహజ వనరుల ఔషధ విలువలు మన పూర్వీకులకు తెలుసునని, ప్రకృతికి గాయాలను, రోగాలను నయం చేసే శక్తి ఉందని గుర్తుంచుకోవడానికి ఈ ప్రాంతీయ పండుగలు మంచి మార్గమని నిపుణులు చెబుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

కళ్లు జిగేల్‌మనేలా పచ్చల గాజులు
కూరల్లో పచ్చిమిర్చి పడేయకుండా తినేయండి