అరటిపండుతో జుట్టు ఎంత పొడగ్గా, అందంగా పెరుగుతుందో..! దీన్ని ఎలా ఉపయోగించాలో తెలుసా..?

By Mahesh RajamoniFirst Published Mar 27, 2023, 10:30 AM IST
Highlights

అరటి హెయిర్ మాస్క్ లు సహజ కండీషనర్లుగా పనిచేస్తాయి. ఇవి జుట్టును మరింత బలంగా, పొడుగ్గా, నల్లగా మెరిసేలా చేస్తాయి. అరటి హెయిర్ మాస్క్ లు చుండ్రు, హెయిర్ ఫాల్, డ్రై హెయిర్ వంటి సమస్యలను కూడా తగ్గిస్తాయి. 
 

ఉరుకుల పరుగుల జీవనశైలి, ఆరోగ్యాన్ని పాడు చేసే ఆహారాలను తినడం, జుట్టు సంరక్షణను పట్టించుకోకపోవడం వల్ల మనలో చాలా మంది జుట్టు రాలడం, చుండ్రు, డ్రై హెయిర్ వంటి ఎన్నో జుట్టు సమస్యలను ఎదుర్కొంటున్నారు. జుట్టు పట్ల ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా వెంట్రుకలు జీవం లేట్టుగా కనిపిస్తాయి. అలాగే వెంట్రుకల చివర్లు చిట్లి పోతాయి. జుట్టు దెబ్బతింటుంది. ఒత్తిడి, వాతావరణ కాలుష్యం ఇందుకు ప్రధాన కారణాలు. అయితే జుట్టు ఆరోగ్యానికి అరటి మంచి మేలు చేస్తుంది. అవును అరటి పోషకాల బాంఢాగారం. దీనిలో ఎన్నో రకాల విటమిన్లు కూడా ఉంటాయి. అందులోనూ అరటి చాలా చౌకగా లభిస్తుంది. అరటి హెయిర్ మాస్క్ లను ఉపయోగించడం వల్ల జుట్టు సమస్యలన్నీ మటుమాయం అవుతాయి. 

అరటి హెయిర్ మాస్క్ ను సహజ కండీషనర్లుగా ఉపయోగిస్తారు. ఇది జుట్టుకు మరింత బలంగా, ఒత్తుగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. అరటిపండు ప్యాక్ చుండ్రును పూర్తిగా తొలగిస్తుంది. అరటిపండ్లలో యాంటీ మైక్రోబయల్ లక్షణాలు, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. జుట్టు సమస్యలను పోగొట్టడానికి అరటి పండు హెయిర్ మాస్క్ ను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం..

జుట్టును తేమగా ఉంచడానికి, విచ్ఛిన్నాన్ని నివారించడానికి.. అరటి పండును పాలు లేదా క్రీమ్ తో  కలిపి డిఐవై హెయిర్ మాస్క్ ను తయారు చేస్తారు. ఈ అరటి హెయిర్ మాస్క్ ను ఇంట్లోనే చాలా సులువుగా తయారుచేయొచ్చు. వాటిని ఎలా తయారుచేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

జుట్టు రాలడాన్ని ఆపడానికి, జుట్టును మరింత బలంగా, ఒత్తుగా, అందంగా చేయడానికి అరటి హెయిర్ మాస్క్ ను ఇలా తయారుచేయండి. 1 అరటిపండు, 1 టీస్పూన్ కలబంద జెల్, 1 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ తోనే ఇంట్లోనే శక్తివంతమైన హెయిర్ మాస్క్ ను తయారుచేయండి. ఈ హెయిర్ మాస్క్ ను జుట్టుకు అప్లై చేసి 20 నిమిషాల పాటు అలాగే ఉంచండి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడగండి. 

పొడి, చిట్లిన జుట్టు కోసం హెయిర్ మాస్క్ ను ఇలా తయారుచేయండి.. సగం అరటిపండును తీసుకుని మెత్తగా చేయండి. దీనికి 1 టేబుల్ స్పూన్ కండీషనర్, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం, 1 టీస్పూన్ ఆలివ్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్ల పెరుగు, 2-3 చుక్కల లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ ను కలపండి. ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసి జుట్టుకు అప్లై చేయండి. 20 నిమిషాల పాటు వదిలేయండి. ఆ తర్వాత జుట్టును బాగా కడగండి. ఈ హెయిర్ మాస్క్ మీ జుట్టును అప్పటికప్పుడే సిల్కీగా, అందంగా మెరిసేలా చేస్తుంది. 

చుండ్రు, నెత్తిమీద ఇన్ఫెక్షన్లను నివారించడానికి, జుట్టు ప్రకాశవంతంగా మెరవడానికి హెయిర్ మాస్క్ ను ఇలా తయారుచేయండి.. బాగా పండిన 2 అరటిపండ్లు, 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె, 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పాలను కలిపి మెత్తని పేస్ట్ లా తయారుచేసుకోండి. మూలాల నుండి జుట్టు చివర్ల వరకు ఈ పేస్ట్ ను పెట్టండి. 30 నిమిషాల తర్వాత జుట్టును నీట్ గా కడగండి. 

ఈ అరటి హెయిర్ మాస్క్ లు చుండ్రు, జుట్టు రాలడం, ఇతర నెత్తిమీద ఇన్ఫెక్షన్లను నివారించడంతో పాటుగా మీ జుట్టును మృదువుగా, మెరిసేలా, ఆరోగ్యంగా చేస్తుంది. 
 

click me!