ఇద్దరు ప్రియుళ్లతో రాసలీలలు.. వద్దన్న భర్తను..

By sivanagaprasad Kodati  |  First Published Dec 22, 2019, 8:43 PM IST

అక్రమ సంబంధం వద్దన్నందుకు తన ఇద్దరు ప్రియుళ్లతో కలిసి హత్య చేసేందుకు ఓ భార్య చేసిన కుట్ర నుంచి ఓ భర్త తృటిలో తప్పించుకున్నాడు


అక్రమ సంబంధం వద్దన్నందుకు తన ఇద్దరు ప్రియుళ్లతో కలిసి హత్య చేసేందుకు ఓ భార్య చేసిన కుట్ర నుంచి ఓ భర్త తృటిలో తప్పించుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ మంకమ్మతోటకు చెందిన గాలిపెల్లి వంశీక్రిష్ణ... రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం రుద్రవరం గ్రామానికి చెందిన కావేరీలు ఇద్దరు ప్రేమించుకున్నారు.

2010లో పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. అయితే వీరి అన్యోన్యతకు గుర్తుగా ఒక కుమారుడు, కుమార్తె జన్మించారు. అయితే అయితే... వీరి పచ్చనికాపురంలో వినాయక నవరాత్రులు చిచ్చు పెట్టాయి... వినాయక నవరాత్రుల కోసం మండపం వేసేందుకు వచ్చిన సమన్విత్ అనే యువకుడి కన్ను కావేరీ పై పడింది.

Latest Videos

undefined

Also Read:ఐదేళ్లలో కోటీశ్వరులైంది వారే: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు

దీంతో... సమన్విత్... స్థానికుడైన గణేష్ అనే యువకుడి సహాయంతో... కావేరీతో మాటలు కలిపాడు... తనదైన శైలిలో మాయమాటలు చెప్పి గణేష్ సహాయంతో కావేరీ... కావేరీ భర్తతో సైతం స్నేహం చేశాడు. చివరకు.. దుర్గభావాని దీక్ష పేరుతో... వారింట్లోనే తిష్టవేశాడు.

ఈ క్రమంలో కావేరి-సుమన్విత్‌ల మధ్య సాన్నిహిత్యం పెరిగి అది అక్రమం సంబంధానికి దారి తీసింది. సుమన్విత్‌తోనే కాకుండా గణేశ్‌తోనూ కావేరీ రెండేళ్లుగా భర్తకు తెలియకుండా అక్రమ సంబంధాన్ని కొనసాగించింది.

చివరకు  ప్రియులిద్దరితో... కావేరీ ఏకాంతంగా ఉన్న ఫోటోలు బయటకు రావడంతో... భార్య వివాహేతర సంబంధం... భర్త వంశీక్రిష్ణకు తెలిసేలా చేసింది. భార్య తీరును తప్పూబట్టిన భర్త వంశీక్రిష్ణ... భార్యను వారించాడు.

దీంతో భార్యభర్తల మధ్య గొడవలు మొదలైయ్యాయి. తమ అక్రమసంబంధానికి అడ్డువస్తున్నాడని ఆగ్రహించిన భార్య కావేరి... తన ఇద్దరు ప్రియుళ్ళతో కలిసి... భర్త వంశీకృష్ణను చంపేందుకు పన్నాగం పన్నింది.

Also Read:Year Roundup 2019: ఒక దిశ, ఒక హాజీపూర్.. దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన తెలంగాణ

ఈ నెల 14వ తేదీన ఉదయం వేళ భర్త పడుకున్న సమయంలో... ప్రియుళ్ళిద్దరిని ఇంట్లోకి పిలిచి... తలకింది దిండుతో వంశీకృష్ణను హత్య చేసేందుకు యత్నించారు. ఇది గమనించిన అతను వారి బారి నుంచి తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డాడు. అక్కడి నుంచి నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి జరిగిన దానిని వివరించాడు.

అయితే అక్కడ వంశీకృష్ణకు చుక్కెదురైంది. పోలీసులు కేసు నమోదు చేసుకోక పోగా.. ఎదురు కేసు పెట్టేందుకు ప్రయత్నించాడు. దీంతో బాధితుడు డయల్ 100 ద్వారా సీపీ కమలాసన్ రెడ్డికి ఫిర్యాదు చేశాడు. స్పందించిన సీపీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాల్సిందిగా ఆదేశించారు. 

click me!