Year Roundup 2019: కరీంనగర్ లో కారు స్పీడుకు బ్రేకులేసిన కాషాయ పార్టీ... మరిన్ని

By Arun Kumar P  |  First Published Dec 22, 2019, 4:00 PM IST

తెలంగాణలో కరీంనగర్ జిల్లా బౌగోళికంగా, రాజకీయంగా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకుంది. ఈ క్రమంలోనే రాజకీయంగా బాగా పరిణతి సాధించిన ఈ జిల్లా ఓటర్లు సందర్భానుసారంగా ఎన్నికల్లో తీర్పునివ్వడం ప్రారంభించారు. ఇలా 2019 లో కూడా అలాంటి తీర్పునే ఇచ్చి కరీంనగర్ పై దేశవ్యాప్తంగా చర్చ జరిగేలా చేశారు. 


కరీంనగర్:  తెలంగాణ రాష్ట్రంలో తనకంటూ ఓ ప్రత్యేక చరిత్రను కలిగిన జిల్లా కరీంనగర్( పూర్వపు పేరు ఎలగందల్). నిజాం పరిపాలనా కాలంలోప్రత్యేక రాజధానికి వెలుగొందిన పట్టణం. అంతేకాకుండా జాతీయస్థాయిలో తెలంగాణ పేరును మారుమోగించిన చరిత్ర కరీంనగర్ సొంతం. తెలుగు ప్రాంతం నుండి దేశ ప్రధాని పివి.నరసింహారావు, ప్రతిష్టాత్మక జ్ఞానపీఠ్ అవార్డును అందుకున్న కవి సింగిరెడ్డి నారాయణ రెడ్డిలను అందించి భారతదేశ చరిత్రలో తరకంటూ ఓ స్థానాన్నిసంపాదించుకుంది. 

ఇలాంటి ఘనచరిత్ర కలిగిన జిల్లాలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు ఎవ్వరికీ అంతుచిక్కడం లేదు. తెలంగాణ ఉద్యమానికి ముందే ఈ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర సమితి హవా వుండేది. అలాంటిది 2019 ఆరంభంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం కారు స్పీడుకు భారతీయ జనతా పార్టీ బ్రేకులు వేసింది. దీంతో ఒక్కసారిగా కరీంనగర్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. 

Latest Videos

undefined


కరీంనగర్ టీఆర్ఎస్ కు కలిసిరాని 2019 

ఈ ఏడాది ఆరంభంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ ప్రజలు బిన్నమైన తీర్పునిచ్చారు. గతంలో కాంగ్రెస్ కంచుకోటగా వున్న ప్రాంతంలో కొంతకాలం టీఆర్ఎస్ హవా జోరుగా కొనసాగింది. అయితే జోరు కాషాయపార్టీ గాలిముందు నిలవలేకపోయింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కు సన్నిహితుడు, తాజామాజీ ఎంపీ  వినోద్ కుమార్ ను కాదని పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు బిజెపి అభ్యర్థి బండి సంజయ్ ను భారీ మెజారిటీతో గెలిపించారు. దీంతో అసెంబ్లీ ఎన్నికల గెలుపు జోష్ లో వున్న టీఆర్ఎస్ అధినాయకత్వం ఒక్కసారిగా డైలమాలోకి పడిపోయింది. 

2018 చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుండి బీజేపీ అభ్యర్ధిగా బండి సంజయ్ బరిలో నిలిచి గంగుల కమలాకరర్ చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత కూడా ప్రజల్లోనే ఉంటూ బీజేపీ పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ వచ్చారు. లోక్ సభ ఎన్నికల్లో బరిలోకి దిగిన బండి సంజయ్ టీఆర్ఎస్ నుంచి బి.వినోద్ కుమార్, కాంగ్రెస్ పార్టీ నుంచి పొన్నం ప్రభాకర్ ను ఓడించి విజయం సాధించారు.

 

కలకలం రేపిన కలెక్టర్, ఎంపీల ఆడియో టేప్ 

 కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కలెక్టర్  మధ్య జరగిన ఓ ఆసక్తి చర్చ బయటకు వచ్చింది. గత ఎన్నికల్లో భాగంగా కలెక్టర్‌ సర్ఫరాజ్‌తో బండి సంజయ్ మాట్లాడిన ఓ ఆడియో టేప్ బయపడడంతో కరీంనగర్ రాజకీయాలు ఓక్కసారిగా వెడెక్కాయి.  మంత్రి గంగుల కమలాకర్‌ ఎన్నికల ఖర్చు విషయమై (ప్రస్తుత కరీంనగర్ ఎంపీ) అప్పటి కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుండి బీజేపీ అభ్యర్ధి బండి సంజయ్, కలెక్టర్ సర్పరాజ్ అహ్మద్‌ మధ్య జరిగిన సంభాషణకు సంబంధించి ఆడియో టేపులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గంగుల పై తప్పుడు కేసు పెట్టి అనర్హత వేటేసేందుకు కుట్ర జరిగిందన్నది ఈ ఆడియో టేపుల సారాశం. ఈ అంశం జిల్లా రాజకీయాలను కుదిపేసింది. 


 

ఆర్టీసి సమ్మె... ఎంపీ సంజయ్ పోలీసుల దాడి

ఆర్టీసీ సమ్మె టైంలో  కరీంనగర్ కు చెందిన నగునూరి బాబు అనే  డ్రైవర్ గుండెపోటుతో మరణించారు. అయితే ఆయన అంతిమయాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. బాబు మృతదేహాన్ని దారి మళ్లించి వేరే చోటుకి తరలించారు. పెద్దఎత్తున ఆర్టీసీ కార్మికులు, వారి కుటుంబసభ్యులు తరలిరావడంతో ఆరేపల్లిలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి.  ఆ సందర్భంగా జరిగిన తోపులాటలో బండి సంజయ్ పట్ల కరీంనగర్ ఏసీపీ అనుచితంగా ప్రవర్తించారు. ఈ క్రమంలోనే ఓ పోలీస్ అధికారి తనపై చేయి చేసుకున్నాడని అరవింద్ ఆరోపించారు. ఈ ఘటన తీవ్ర దుమారం రేపింది. 

ఇది ఎక్కడివరకు వెళ్లిందంటే తనపై పోలీసుల దౌర్జన్యం పట్ల సంజయ్ కుమార్ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు. దాడికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను స్పీకర్‌కు అందజేశారు. దీనిపై స్పందించిన ఓం బిర్లా.. ఈ ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా లోక్‌సభ ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్ సుశీల్ కుమార్ సింగ్‌ను ఆదేశించారు.


 

ఆడియో టేపుల వివాదం... జిల్లా కలెక్టర్ బదిలీ


కరీంనగర్ జిల్లా కలెక్టర్ సర్పరాజ్ అహ్మాద్‌పై తెలంగాణ సర్కార్  బదిలీ వేటు వేసింది. ఎంపీ ఎంపీ బండి సంజయ్, జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మాద్‌ మధ్య జరిగిన ఆడియో సంభాషణ ఇటీవల కాలంలో బయటకు వచ్చింది.ఈ ఆడియో సంభాషణపై రాజకీయవర్గాల్లో పెద్ద దుమారం రేగింది.ఈ విషయమై ఉన్నతాధికారులకు  కలెక్టర్ సర్పరాజ్ అహ్మాద్ వివరణ కూడ ఇచ్చారు. ఈ ఘటనపై తెలంగాణ సీఎస్ ఎస్‌కె జోషీ విచారణ జరిపారు. సర్పరాజ్ అహ్మాద్‌పై బదిలీ వేటు వేయాలని  నిర్ణయం తీసుకొన్నారు.సర్పరాజ్ అహ్మాద్‌ స్థానంలో గద్వాల జిల్లా కలెక్టర్‌గా ఉన్న శశాంకను కరీంనగర్ జిల్లా కలెక్టర్‌గా  నియమించారు. 

 

విచిత్రం... వేశ్యవృత్తికోసం అమ్మాయిగా మారిన యువకుడు 

కరీంనగర్ జిల్లా ధర్మారంలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. కొత్తూరు గ్రామానికి చెందిన ఓ  యువకుడు ఉన్నత విద్యాబ్యాసం చదివినా సరైన ఉద్యోగం లభించకపోడంతో విచిత్రమైన నిర్ణయం తీసుకున్నాడు.  సులభంగా డబ్బు సంపాదించాలన్న దురుద్దేశంతో మహిళగా మారి వ్యభిచారం ప్రారంభించాడు.  అంగ మార్పిడి చేయించి మహిళగా మారిన యువకుడి ఘటన జిల్లాలో సంచలనంగా మారింది. 


కరీంనగర్ లో ఐటీ టవర్...భారీగా ఉద్యోగావకాశాలు

కరీంనగర్ ఐటీ టవర్ ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 30వ తేదీన రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఈ ఐటీ టవర్ ను ప్రారంభించనున్నట్లు మంత్రి గంగుల ప్రకటించారు. ఈ మేరకు తుది నిర్మాణ పనులను ఆయన  ఇవాళ పరిశీలించారు. ఐటీ అధికారులు, కాంట్రాక్టర్లకు పలు సూచనలు చేశారు. దాదాపు 3000 మంది యువతకు ఇక్కడ ఉపాధి లభించే అవకాశం ఉందని మంత్రి స్పష్టం చేశారు. 

 అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగరానికి ఐటీ టవర్ కేటాయించారని మంత్రి గంగుల చెప్పారు. హైదరాబాద్ కు మాత్రమే పరిమితం కాకుండా అన్ని జిల్లాల్లో అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టారని తెలిపారు. కరీంనగర్ వాసులు ఇక్కడే ఉద్యోగం చేసుకునే విధంగా ఈ టవర్ ఉపయోగపడుతుందని అన్నారు. ఐదు ఫ్లోర్ల భవనంలో గ్రౌండ్ ఫ్లోర్ లో రిసెప్షన్, క్యాంటీన్... మిగిలిన ఫ్లోర్లలో కార్యాలయాలు ఉంటాయన్నారు. ఇప్పటికే 11 కంపెనీలతో ఎంవోయూలు పూర్తికాగా మరిన్ని కంపెనీలు కూడా కరీంనగర్ వస్తున్నాయని చెప్పారు. 

 

click me!