ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంఘీభావంగా బీజేపీ చేపట్టిన నిరసన ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎంపీ బండ సంజయ్ కుమార్‌తో పాటు పలువురిని అదుపులోకి తీసుకుని పీఎస్‌కు తరలించారు.
తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె 11వ రోజు కొనసాగుతోంది. ఇన్ని రోజులు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి ఎటువంటి హామీ లేకపోవడంతో కార్మిక సంఘాలు సమ్మెను ఉద్థృతం చేశాయి.
వీరికి రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్ధి సంఘాలు మద్ధతుగా నిలిచాయి. కరీంనగర్ బస్టాండ్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులకు జేఏసీ నేతలు పిండ ప్రదానం చేశారు.
undefined
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంఘీభావంగా బీజేపీ చేపట్టిన నిరసన ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎంపీ బండ సంజయ్ కుమార్‌తో పాటు పలువురిని అదుపులోకి తీసుకుని పీఎస్‌కు తరలించారు.
మరోవైపు సంగారెడ్డిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే అరెస్ట్‌కు నిరసనగా ఆందోళనకారులు రాళ్ల దాడికి పాల్పడటంతో పరిస్ధితి ఉద్రిక్తంగా మారింది.
మెదక్, సిద్ధిపేట, సంగారెడ్డి జిల్లాల్లోని బస్సు డిపోల మందు ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. నిజామాబాద్‌లో ఆర్టీసీ కార్మికులు, ప్రజాసంఘాలు మానవహారం నిర్వహించారు.