కరీంనగర్ న్యూస్: ముఖ్యమంత్రి, మంత్రులపై పోలీసులకు ఫిర్యాదు

By Arun Kumar P  |  First Published Oct 14, 2019, 7:39 PM IST

కరీంనగర్ జిల్లాలో ఆర్టీసి సమ్మె ఉదృతంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో మాజీ టీఆర్ఎస్ ఎమ్మెల్యే  ఒకరు ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు మంత్రులపై పోలీసులకు ఫిర్యాదు చేసి సంచలనం సృష్టించారు. 


కరీంనగర్: పట్టణంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మాజీ టీఆర్ఎస్ ఎమ్మెల్యే బొడిగె శోభ ఫిర్యాదు చేశారు. ఆయనతో పాటు మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, పువ్వాడ అజయ్ కుమార్, గంగుల కమలాకర్ లపై కేసు నమోదు  చేయాలంటూ ఫిర్యాదు చేశారు. ఆర్టీసి కార్మికుల ఆత్మహత్యలకు వీరే కారణమంటూ ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 

Latest Videos

undefined

ఇంధనం లేక నడిరోడ్డుపై నిలిచిన ఆర్టీసి బస్సు

కరీంనగర్ డిపో కు చెందిన ఆర్టీసి బస్ హైదరాబాద్ వెళ్తుండగా రోడ్డుపై హఠాత్తుగా ఆగిపోయింది. కరీంనగర్ లో హడావుడిగా బస్సును తీసుకుని బయలుదేరే క్రమంలో డీజిల్ ను చెక్ చేసుకోలేదని తాత్కాలిక డ్రైవర్ తెలిపాడు. దీంతో మేడ్చల్ క్రాస్ రోడ్ వద్ద బస్సు నిలిచిపోయింది. ఈ ఘటనతో బస్సులోని 60 మంది ప్రయాణికులు ఇబ్బందిపడాల్సి వచ్చింది. 

మిషన్ భగీరథపై స్థానిక మంత్రి సమీక్ష

 కరీంనగర్ కలెక్టరేటు సమావేశ మందిరంలో మిషన్ భగీరథ పనుల పురోగతిపై బిసి సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అధికారులతో సమావేశమయ్యారు. ముఖ్యంగా అర్బన్,రూరల్ ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షను నిర్వహించారు. 

click me!