వలస మంత్రుల నిర్వాకమే... ఆర్టీసి ఆస్తులపై కన్నేసి...: కోదండరాం

By Arun Kumar PFirst Published Oct 15, 2019, 3:38 PM IST
Highlights

కరీంనగర్ వేదికన జరుగుతున్న ఆర్టీసి కార్మికుల సమ్మెలో టీజేఎస్ అధినేత కోదండరాం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులపై ఫైర్ అయ్యారు.  

కరీంనగర్: జిల్లాకేంద్రంలో అర్టిసి కార్మికులు చేపడుతున్న సమ్మెకు తెలంగాణ జన సమితి పార్టీ నాయకులు కోదండరాం మద్దతుగా నిలిచారు.  గత పదిరోజులుగా ఆర్టిసి కార్మికులు చేపడుతున్న నిరసనకు పీఆర్టీయూ, డిటిఎఫ్ ఉపాధ్యాయ సంఘాల మద్దతు కూడా లభించింది. 

కరీంనగర్ లో కోదండరాం మాట్లాడుతూ... నాడు ఆర్టీసీని విలీనం చేస్తానని నేడు అనలేదు అని అబద్దాలు మాట్లాడడం ముఖ్యమంత్రి స్థానంలో వున్న కెసిఆర్ కు చెల్లిందన్నారు. ఊసరవెల్లిలా రంగులు మార్చిన నాయకులకు పెద్దపీట వేసి కేవలం వారు చెప్పింది మాత్్రమే వింటూ కార్మికులను తొలగిస్తామని అనడం సిగ్గుపడాల్సిన విషయమని విమర్శించారు. 

ఉద్యమం చేస్తున్న కార్మికులకు మద్దతు తెలపడానికి వచ్చిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ను అరెస్టు చేయడాన్ని ఆయన ఖండించారు.  ఆర్టిసి కండక్టర్లు, డ్రైవర్ల స్థితిగతుల గురించి కెసిఆర్ కు ఏం తెలుసని ప్రశ్నించారు.

సంవత్సరంలోని 365 రోజులు పని చేసేది కేవలం కార్మికులు మాత్రమేనని కెసిఆర్ గుర్తుంచుకోవాలన్నారు. కేవలం వలస వచ్చిన మంత్రులు చెప్పింది విని విలీనం సాధ్యం కాదనడం సిగ్గుమాలిన పనిగా ఆయన అభివర్ణించారు. మంత్రులే వలస వచ్చిండ్రు... కార్మికులు కాదని ఆయన తెలిపారు. 

ఆనాడు తెలంగాణ వస్తే ఆంధ్ర వాళ్ళ పెత్తనం పోయి ఆర్టీసీ కార్మికుల జీవితాలు బాగుపడతాయని కేసీఆర్ అన్నాడు. కానీ ఇప్పుడు కేవలం తన జీవితం బాగుపడడం కోసం ఆర్టీసీని ప్రైవేటు పరం చేయాలని చూస్తన్నారని...దీన్ని ఎట్టిపరిస్థితుల్లో ఊరుకునేది లేదన్నారు. 

ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని  కోదండరాం ప్రభుత్వానికి హెచ్చరించారు. పువ్వాడ అజయ్ కుమార్ ఏనాడైనా కార్మికులతో కలిసి నడిచారా..? అని ప్రశ్నించారు. కేవలం ఆర్టీసీ భూములను కబ్జా కోసం విలీనం చేయమనడం... అందుకు ఆచరణ కాదని చెప్పడం  తగదన్నారు. ఆర్టిసిని ప్రభుత్వంలో విలీనం చేసి తీరాల్సిందేనని కార్మికుల పక్షాన డిమాండ్ చేశారు. 

టీఎస్ఆర్టిసి అమ్మకానికి ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదని నీ నిరంకుశ పాలనకు పరిష్కార మార్గం చూపిస్తామని కార్మికుల సాక్షిగా చెబుతున్నానని తెలిపారు.

click me!