టీఆర్ఎస్, కాంగ్రెస్ లకు షాక్... బరిలో నిలిచిన అభ్యర్థులే బీజేపీలో చేరిక

By Arun Kumar P  |  First Published Jan 17, 2020, 7:41 PM IST

కరీంనగర్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలు రోజురోజుకు మరింత రసవత్తరంగా మారుతున్నారు. టీఆర్ఎస్ మంత్రి గంగుల కమలాకర్, బిజెపి ఎంపీ బండి సంజయ్ లు ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పోటీ రసవత్తరమయ్యింది. 


కరీంనగర్: తెలంగాణలో జరుగుతున్న పురపాలక ఎన్నికల్లో ప్రధాన పార్టీలన్నింటిని రెబల్స్ బెడద వెండాతోంది. ఇది అధికార టీఆర్ఎస్ లో మరీ ఎక్కువగా వుంది.  దీన్నే కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తరకు అనుకూలంగా మలుచుకున్నాడు. కరీనగర్ మున్సిపల్ కార్పోరేషన్ లో టీఆర్ఎస్, కాంగ్రెస్ తరపున రెబల్ గా బరిలోకి దిగిన అభ్యర్థులను అత్యంత చాకచక్యంగా బిజెపి లో చేర్చుకుని ఆ పార్టీ అభ్యర్థి విజయానికి బాటలు వేశారు. ఇలా ఎంపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ టీఆర్ఎస్, కాంగ్రెస్ లకు షాకిచ్చారు.

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 57వ డివిజన్ నుంచి కాంగ్రెస్ రెబల్ అభ్యర్ధులుగా న్యాలకొండ సుజాత-ప్రసన్న, టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థులుగా విజయ- సంపత్ లు బరిలోకి దిగారు. అయితే వీరు తాజాగా స్థానిక ఎంపీ బండి సంజయ్ కుమార్ సమక్షంలో బీజేపీలో చేరారు. స్వయంగా ఎంపీ సంజయ్ వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Latest Videos

undefined

read more  రెబల్ అభ్యర్ధులకు బెదిరింపులు... అసలేం జరిగిందంటే: గంగుల వివరణ

ఈ సందర్భంగా 57వ డివిజన్ లో బీజేపీ నుంచి పోటీ చేస్తున్న బండ సుమ-రమణారెడ్డికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు వారు ప్రకటించారు. ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం తమవంతు కృషి చేస్తామని చెప్పారు. ఈ చేరిక కార్యక్రమంలో బీజేపీ నగర అధ్యక్షుడు బేతి మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.
 

click me!