కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లో మున్సిపోల్స్...పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తి

By Arun Kumar P  |  First Published Jan 21, 2020, 6:59 PM IST

కరీంనగర్, జగిత్యాల జిల్లాలోని మున్సిపాలిటీలలో బుధవారం జరగనున్న పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ జిల్లాల కలెక్టర్లు, పోలీస్ అధికారులు వివిధ పోలింగ్ బూతులను పరిశీలించి ఏర్పాట్లను పరిశీలించారు.


జగిత్యాల జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలలో బుధవారం జరగనున్న పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎన్నికల కోసం పలు పోలింగ్ బూతుల్లో జరుగుతున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ శరత్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా  285 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 

ఎన్నికలు జరిగే ఐదు మున్సిపాలిటీలలో 134 వార్డులు ఉన్నాయని... వాటిల్లో 97 ప్రాంతాల్లో 285 పొలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల కోసం మొత్తం1810 సిబ్బందిని ఉపయోగిస్తున్నారు.  ఐదు మున్సిపాలిటీలను 31 జోన్లుగా విభజించి జోనల్, రూట్ ఆఫీసర్ల ను నియమించారు. 285 పోలింగ్ కేంద్రాలలో 51 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక ప్రాంతాలు గా గుర్తించినట్లు కలెక్టర్ తెలిపారు. 

Latest Videos

undefined

జిల్లా ఎస్పీ సింధూ శర్మ మాట్లాడుతూ.... రేపు జరిగే మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసే వరకు జిల్లాలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని వెల్లడించారు. జిల్లాలో అన్ని మున్సిపాలిటీలలో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకున్నామన్నారు. జిల్లాలో పాత నేరస్తులు, అనుమానితులను ఇప్పటికే 149 మందిని బైండోవర్ చేశామని తెలిపారు. 

పోలింగ్ కేంద్రాల సమీపంలో వంద మీటర్ల వరకు ఆంక్షలు ఉంటాయన్నారు. పోలింగ్ రోజున అభ్యర్థులు ఓటర్లను రవాణా చేయడం, భోజన వసతులు ఏర్పాటు చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలింగ్ బూత్ లో ఓటింగ్ సమయంలో ఓటర్లు ఫొటోలు, సెల్ఫీలు దిగితే వారిపై కూడా చట్టరీత్యా కేసులు నమోదు చేస్తామని ఎస్పీ హెచ్చరించారు.

 కరీంనగర్ జిల్లాలో ఎన్నికల కోసం జరుగుతున్న  ఏర్పాట్లను ఆ జిల్లా కలెక్టర్ శశాంక, పోలీస్ కమిషనర్ కమలహాసన్ రెడ్డి పరిశీలించారు. జమ్మికుంట డిగ్రీ కాలేజి లో మున్సిపల్ ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను మొదట వారరు పరిశీలించారు.   

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లడుతూ... కరీంనగర్ జిల్లాలో జనవరి 22న జరిగే నాలుగు మున్సిపాలిటీల ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ  నాలుగు మున్సిపాలిటీల పరిధిలో 146 వార్డులకు 493 పోలింగ్ స్టేషన్లు, 122 లోకేషన్ లలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నికల బరిలో 751 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని వెల్లడించారు.

హుజురాబాద్ లో రెండు వార్డులు, కరీంనగర్ కార్పొరేషన్ లో రెండు డివిజన్లకు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఆయన తెలిపారు. హుజురాబాద్ మున్సిపాలిటి కి  సంబంధించి హుజురాబాద్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో డిస్ట్రీబ్యూషన్, రిసెప్షన్, కౌంటింగ్ కెంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జమ్మికుంట మున్సిపాలిటికి సంబంధించి ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, చొప్పదండి మున్సిపాలిటికి సంబంధించి చొప్పదండి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో , కొత్తపల్లి మున్సిపాలిటికి సంబంధించి కొత్తపల్లి జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో కరీంనగర్ నగర పాలక సంస్థ ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వ ఎస్.ఆర్.ఆర్. డిగ్రీ కాలేజీలో డిస్ట్రీబ్యూషన్, రిసెప్షన్, కౌంటింగ్ కెంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.

మున్సిపాల్ ఎన్నికలకు 120 బస్సులు వాడుతున్నామని, 592 మంది ప్రిసైడింగ్ ఆఫీసర్లు, 592 అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లు, 1,795 మంది ఇతర పోలిస్ ఆఫీసర్లు మొత్తం 2,751 మంది ఎన్నికల సిబ్బంది నియమించినట్లు కలెక్టర్ తెలిపారు. ఎన్నికల నిర్వహణకు 54 మంది రిటర్నింగ్ ఆఫీసర్లు, 54 మంది అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లు నియమించామని ఆయన తెలిపారు. 

read more  కరీంనగర్ మున్సిపోల్స్: అధికారులపై కలెక్టర్ సీరియస్... 209 మందికి షోకాజ్ నోటీసులు

అన్ని మున్సిపాలిటీలలో 131 సమస్యాత్మక , అతి సమస్యాత్మక పోలింగ్ స్టెషన్లు ఉన్నాయని గుర్తించామని తెలిపారు. సమస్యాత్మక , అతి సమస్యాత్మక పోలింగ్ స్టెషన్లలో వెబ్ కాస్టింగ్ చేయిస్తున్నామని, 52 లోకేషన్లలో వీడియోగ్రఫీ చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. మొత్తం 70 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించామని తెలిపారు. నాలుగు మున్సిపాలిటీలలో జనవరి 25 న,  కరీంనగర్ నగర పాలక సంస్థలో జనవరి 27 న ఉదయం 8.00 గంటల నుండి  ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని కలెక్టర్ తెలిపారు. 

ఓటర్లందరికి ఫోటొ, ఓటర్ స్లిప్ లు పంపిణి చేశామని, ప్రతి ఓటర్ ఓటు వేయుటకు వెళ్ళె ముందు ఫోటో, ఓటర్ స్లిప్ తో పాటు 18 రకాల వ్యక్తిగత గుర్తింపు కార్డులలో ఏదేనీ ఒకటి వెంట తీసుకెళ్ళి ఓటు హక్కు వినియోగించుకోవాలని తెలిపారు. ఎన్నికలు అన్ని పోలింగ్ స్టేషన్ పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. నాలుగు మున్సిపాలిటీల పరిధిలో ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రం 5.00 గంటలతో ముగిసిందని కరీంనగర్ నగరపాలక సంస్థలో జనవరి 22 సాయంత్రం 5.00 గంటలలోపు ముగుస్తుందని తెలిపారు. 

ఎన్నికలకు ఒకరోజు ముందు ఎన్నికల రోజు ప్రింట్ మీడియాలో అడ్వర్టైజ్ మెంట్ల ప్రచురణలకు మీడియా నోడల్ ఆఫీసర్ సర్టిఫికేషన్ తప్పని సరి అవసరం అని తెలిపారు. మున్సిపాల్ ఎన్నికలలో 3,50,879 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నానరని అందులో కరీంనగర్ నగర పాలక సంస్థలో 2,72,692 మంది ఓటర్లు ఉన్నారని కలెక్టర్ తెలిపారు. ఓటర్లు తమ ఓటు హక్కును ప్రశాంత వాతావరణం లో నిర్బయంగా, స్వేచ్చగా వినియోగించుకోవాలని కలెక్టర్ ఓటర్లను కోరారు. 

జనవరి  24 న కరీంనగర్ నగర్ పాలక సంస్థకు జరుగు ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకొనుట అన్నివిద్యాసంస్థలు ఇతర సంస్థలల్లో పని చేయుచున్న ఉద్యోగులకు లేబర్ యాక్ట్ ప్రకారం 3.00 గంటల అనుమతి కల్పించిందని తెలిపారు.

read more  ఎర్రబెల్లి వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేయాలి: జీవన్ రెడ్డి డిమాండ్

పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి మాట్లాడుతు... మున్సిపాల్ ఎన్నికల నిర్వహణకు పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. సోమవారం తో ప్రచారం ముగిసిన నాలుగు మున్సిపాలిటీలలో ప్రచార కార్యక్రమాలు ప్రశాంతంగా జరిగాయని, అభ్యర్థులకు ధన్యవాదాలు తెలిపారు. పోలింగ్ కు ముందు ఓటర్లను ఎలాంటి ప్రలొబాలకు గురి చేయకుండా అన్ని చోట్ల పోలిస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.  

ఎన్నికలకు ఆటంకం కలిగిస్తారని, ఉద్దేశంతో 492 మందిని బైండోవర్ చేశామని, 15 మందిని జైలుకు పంపామని ఆయన తెలిపారు. పోలీస్ కెంద్రాల పరిధిలో సి.సి. కెమెరాలు ఏర్పాటు చేశామని తెలిపారు. పోలింగ్ స్టేషన్ కు వంద మీటర్ల పరిధిలో ఎవరిని అనుమతించమని తెలిపారు. ఓటర్లు నిర్బయంగా, స్వేచ్చగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు.

 

click me!